
ఇలా తరచూ ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తు ఇంకా సభ్య సమాజంలో మూఢనమ్మకాలు అనేవి పాతుకుపోయాయి అన్నదానికి నిదర్శనం గా మారిపోతున్నాయి అని చెప్పాలి.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. గత కొన్ని రోజుల క్రితం ఒక మహిళ అదృశ్యమైంది. అయితే ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా అదృశ్యమైన మహిళ చివరికి చెరువులో శవమై తేలింది.
ఈ ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో వెలుగు చూసింది అని చెప్పాలి. ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన అవంతిక అనే బాలింత చివరికి చెరువులో శివమై తేలింది. అయితే పౌర్ణమి ఆదివారం కావడం.. ఇక అర్ధరాత్రి అవంతిక ఒంటరిగా వెళుతున్న వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడం సంచలనంగా మారిపోయింది. అదే సమయంలో డెడ్ బాడీ లభించిన చోట నిమ్మకాయలు పసుపు కుంకుమ కూడా లభించడంతో క్షుద్ర పూజల కారణంగానే ఆమె చనిపోయిందని గ్రామస్తులందరూ కూడా భయాందోళనలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.