
అయితే ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై ప్రేమ పుట్టడం సహజం.. అయితే ఆ ప్రేమను వ్యక్తపరిచిన తర్వాత ఎదుటి వ్యక్తి ఒప్పుకుంటాడా లేదా అన్నది వారే ఇష్టయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ కొంతమంది ఇలా తమ ప్రేమను అంగీకరించలేదు అన్న కారణంతో కక్ష పెంచుకొని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక ఇలా ఇటీవల కాలంలో ప్రేమోన్మాధులు రెచ్చిపోతున్న తీరు అందరిని ఉలిక్కిపడేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. ప్రేమోన్మాధుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్న అమ్మాయిల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ ఇలాంటి ఓ దారుణమే జరిగింది.
బెంగళూరులో కాకినాడ యువతి లీలా పవిత్ర దారుణ హత్యకు గురైంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ కేసులో నరసన్నపేటకు చెందిన దినకర్ ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. కీలక విషయాలను వెల్లడించాడు నిందితుడు. విశాఖ లో ఎంఎస్సీ చదివే సమయం నుంచి నీల పవిత్రను ప్రేమిస్తున్నానని.. ఇక పెళ్లికి ఒప్పించేందుకు ఎంతగానో ప్రయత్నించాను అంటూ దినకర్ తెలిపాడు. కానీ ఎంత ప్రయత్నించినా లీలా ఒప్పుకోలేదని.. అందుకే నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు అని కసి తీరా పొడిచాను అని షాకింగ్ విషయాలను విచారణలో ఒప్పుకున్నాడు. కాగా అతని కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు పోలీసులు.