కాకి పిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బు బిల్లా కవితకు కాదేది అనర్హం అన్నారు శ్రీశ్రీ.. అయితే శ్రీశ్రీ చెప్పిన మాటలను కొంతమంది కేటుగాళ్లు  బాగా  ఫాలో అవుతున్నారు. అయితే శ్రీశ్రీ చెప్పినట్లుగా కాదు ఇక మోసాలకు కాదేది అనర్హం అన్నట్లుగా ఆ పదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేసుకొని అందని కాడికి దోచుకుంటున్నారు. నేరాలు చేయడానికి ఏ దారి అయినా ఓకే అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఎప్పుడు ఎవరు మోసం చేస్తారో తెలియక అనుక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి సాధారణ జనాలకు వచ్చింది అని చెప్పాలి.


 ముంబై నగరంలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ ఘటన ఇప్పుడు వరకు పోలీసులు సైతం కానీ విని ఎరుగనిది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎంతో అభిమానంతో మొబైల్ ని గిఫ్ట్ గా ఇచ్చిన వ్యక్తి.. ఇక ఆ తర్వాత ఏడు లక్షల రూపాయలు కాజేశాడు. ముంబైకి చెందిన మహిళకు ఈ ఏడాది జనవరిలోనే సౌరబ్ శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ బహుమతిగా వచ్చింది. తమ సంస్థ నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే నగరంలోని స్పోర్ట్స్ క్లబ్లో మెంబర్షిప్ కూడా లభిస్తుందని సదరు వ్యక్తి చెప్పాడు. ఈ క్రమంలోనే సౌరబ్ శర్మ మాటలు నమ్మిన బాధితురాలు కార్డు తీసుకునేందుకు అంగీకరించింది.


 అయితే తాము ఇచ్చే  క్రెడిట్ కార్డు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే పని చేస్తుందని.. కార్డు తీసుకుంటానంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ గిఫ్ట్ గా ఇస్తామని చెప్పాడు. ఇక కార్డు తీసుకుంటే ఫోన్ గిఫ్ట్ వస్తుందని ఆశ పడింది మహిళ. ఇక ఆ తర్వాత మహిళకు సంబంధించిన అన్ని వివరాలను కూడా అతనికి షేర్ చేసింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఇక అందులో సౌరబ్ శర్మ చెప్పినట్లుగానే డీటెయిల్స్ నమోదు చేసి లాగిన్ అయింది. ఇక అదే రోజు కొన్ని గంటల తర్వాత మహిళ మొబైల్ కు బ్యాంక్ ట్రాన్స్ఫర్లకు సంబంధించిన మెసేజ్లు వచ్చాయి. దాదాపు 7 లక్షల షాపింగ్ చేసినట్లు మెసేజ్ రావడంతో చూసి ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: