ఇటీవల కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సభ్య సమాజం లో మానవత్వం ఉన్న మనుషుల కంటే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న మానవ మృగాలే ఎక్కువగా ఉన్నారు అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఎందుకంటే పరాయి వాళ్ళ విషయం లోనే కాదు సొంత వారి విషయం లో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు నేటి రోజుల్లో మనుషులు. వెరసి దారుణం గా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 అయితే ఇక కొంతమంది ఇలా హత్యలు చేసేందుకు ఎక్కడ భయపడని పరిస్థితి ఉంది. ఏకంగా నేరాలను అరికట్టే  పోలీస్ స్టేషన్లోనే హత్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మరికొన్నిసార్లు ఏకంగా నేరస్తులకు శిక్ష వేసే కోర్టుల ఆవరణలోనే దారుణమైన దాడులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినది అని చెప్పాలి. ఏకంగా కోర్టు ప్రాంగణంలోనే భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఒక కసాయి భర్త. తనను, పిల్లలను కాదని ఇక ప్రియుడు మోజులో పడి అతనితో వెళ్లిపోయింది  అనే కోపంతో విచక్షణ కోల్పోయాడు. దీంతో ఇక కోర్టు ప్రాంగణంలోనే దారుణంగా యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో వెలుగు చూసింది. ఒక చోరీ కేసులో నిందితురాలు అయినా మహిళ బెయిల్ పై ఇటీవల విడుదల అయింది. అయితే విచారణ నిమిత్తం జిల్లా కోర్టుకు వస్తుందని తెలుసుకున్న భర్త.. పక్క ప్రణాళికతో అక్కడికి వెళ్లి ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇక నిందితున్ని అదుపులోకి తీసుకొని బాధితురాలని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ సంబంధం వల్లే ఇలా దాడికి పాల్పడినట్లు అతను ఒప్పుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: