సాధారణం గా భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు చిరునామాగా ఉండాలి . కానీ ఇటీవల కాలంలో భార్యా భర్తల బంధం లో ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరీ ఇష్టాలను మరొకరు గౌరవిస్తూ సర్దుకు పోయి బ్రతకాల్సింది పోయి.. నేనంటే నేను గొప్ప అని ఈగోలకు పోతున్న భార్యా భర్తలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. చివరికి చిన్న చిన్న కారణాలకే భార్యా భర్తల మధ్య గొడవలు తలెత్తుతున్నాయి. ఇక ఈ గొడవలు చిలికి చిలికి గాలి వానలా  చివరికి దారుణమైన ఘటనలకు కారణమవుతూ ఉన్నాయి అని చెప్పాలి.


 అయితే ఇలా తరచూ గొడవలతో ఇబ్బంది పడుతున్న భార్యాభర్తలు కలిసి జీవించలేం అని భావించి.. ఇక కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకుంటున్నారు. ఇలా విడాకులు తీసుకొని వీడిపోయిన బాగుంటుంది. కానీ కొంతమంది అయితే గొడవలు జరుగుతున్నాయి అనే కారణంతో ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు పెళ్లి అనే బంధం పై అందరికీ ఉన్న ఆలోచనను పూర్తిగా మార్చేస్తున్నాయి. పెళ్లి చేసుకుంటే ఇంత దారుణంగా ఉంటుందా అని ప్రతి ఒక్కరు భయపడే పరిస్థితులకు కారణం అవుతున్నాయి అని చెప్పాలి.


 ఇక్కడ ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అన్న అనుమానంతో  నలభై ఏళ్ల వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. గొండ జిల్లా కాశీపూర్ గ్రామంలో హత్య చేసి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని స్థానికులు పోలీసులకు అప్పగించారు. కాగా నిందితుడికి మృతురాలితో పదేళ్ల క్రితం వివాహం జరగగా.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: