సాధారణంగా క్లాస్ టీచర్లు అంటే ఎప్పుడు కాస్త కఠినంగానే ఉంటారు అన్న విషయం స్టూడెంట్స్ కి తెలుసు. ఇక సరిగ్గా చదవకపోతే బెత్తంతో వాతలు వచ్చేలా కొట్టేవారు ఒకప్పుడు టీచర్స్. అంతేకాదు ఇక ఎప్పుడూ ఎంతో సీరియస్ గా ఉండే టీచర్లను చూస్తే విద్యార్థులు భయపడే విధంగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టీచర్లను చూసి భయపడటం కాదు ఏకంగా టీచర్ల మీదే పంచులు వేసే స్థాయికి విద్యార్థులు ఎదిగారు. టీచర్లు కూడా ఒకప్పటిలా గంభీరంగా కాకుండా ఇక విద్యార్థుల్లో కలిసిపోయి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్నారు అని చెప్పాలి. అయితే టీచర్లు ఉండే ఫ్రెండ్లీ నెస్ ఈ మధ్య కాలంలో కాస్త మితిమీరి పోతుందేమో అని అనిపిస్తుంది.



 ఏకంగా విద్యార్థులకు మంచి చెడులు చెప్పి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లు.. వాళ్ళ ముందే డాన్సులు చేస్తూ విచిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి తరహా వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక లేడీ టీచర్ డాన్స్ చేసిన వీడియో ఇక ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. శివపురి జిల్లాలోని కరాయిరాలో సిసిఎల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ట్రైనింగ్ సెషన్ ముగియగానే అక్కడ ఉన్న టీచర్ తో కాసేపు ఆనందంగా గడిపేందుకు హిందీ సినిమాలోని ఒక పాటకు అద్భుతంగా డాన్స్ చేశారు.




 అయితే తరగతి గదిలో లేడీ టీచర్ ఇలా డాన్సులు చేస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయారు అని చెప్పాలి.  అయితే ఇక ఇలా లేడీ టీచర్ డాన్స్ చేస్తుంటే అంతలోనే అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ ఇక ఆయన కూడా కాలు కదిపి టీచర్ కి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో చూసి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నేటిజన్స్. సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్లు ఇలా విద్యార్థుల ముందు పిచ్చిగంతులు వేసి పిచ్చిగా ప్రవర్తిస్తే ఇక విద్యార్థులు ఎలా తయారవుతారు అని కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: