కావాల్సిన ప‌దార్థాలు:
చేపముక్కలుల‌- ఐదు 
మైదా- మూడు టేబుల్ స్పూన్స్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా
కోడిగుడ్డు- ఒక‌టి

 

బ్రెడ్ పొడి- అరకప్పు
నూనె- స‌రిప‌డా
మిరియాల పొడి- అర టీస్పూన్

 

వెనిగర్- రెండు స్పూన్లు
కారం- ఒక టేబుల్‌ స్పూన్
పసుపు- చిటికెడు

 

తయారీ విధానం:
ముందుగా చేప‌ముక్క‌ల‌ను నీటితో శుభ్రం చేసి ముళ్లు తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్డు సొనను బాగా గిలకొట్టి పెట్టుకోవాలి. త‌ర్వాత  ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్క‌ల‌ను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అయితే మరీ మెత్తగా కాకుండా కాస్త కచ్చాబచ్చాగా ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని ఓ బౌల్ లో తీసుకుని వెనిగర్ వేసి కలపాలి.

 

తరువాత మైదా, మిరియాల పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, ఫింగ‌ర్స్ మాదిరిగా ఒత్తుకోవాలి. వీటిని కోడిగుడ్డు సొనలో ముంచి తీసి, బ్రెడ్ పొడిలో దొర్లించి, నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే స‌రిపోతుంది. అంతే నోరూరించే ఫిష్ ఫింగర్స్ రెడీ.. వీటిని ఏదైనా సోస్‌తో వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో.. ఖ‌చ్చితంగా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: