మీ అందరికి చామ దుంపల గురించి తెలిసే ఉంటుంది.అయితే ఈరోజు ఇండియా హెరాల్డ్ వారు మీకోసం చామ దుంపల పులుసు ఎలా చేయాలో మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా చామ దుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూడండి.
 
కావలిసిన పదార్ధాలు:

పావుకేజీ చామదుంపలు

1 లేదా 180 గ్రాములు పెద్ద ఉల్లిపాయ

3 పచ్చి మిరపకాయలు

20 గ్రాములు చింతపండు

1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్

ఉప్పు తగినంత

½ tsp పసుపు

3 tsp కారం

½ tsp జీలకర్ర

1 tsp ధనియాల పొడి

½ tsp గరం మసాలా

5 tbsp నూనె

2 రెమ్మలు కరివేపాకు

¼ కప్పు కొత్తిమీర

నీళ్ళు

½ tsp ఆవాలు

½ tsp జీలకర్ర

2 ఎండు మిరపకాయలు

తయారీ విధానం :
 ముందుగా చామ దుంపలను శుభ్రంగా కడిగి ఒక  ప్రెషర్ కుక్కర్ లో వేసి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. కొద్ది సేపు అయ్యాక కుక్కర్ లో నుంచి  ఉడకబెట్టిన చామదుంపలను తీసి వాటి పైన ఉన్న తొక్కలు తీసి వేయాలి. ఇప్పుడు ఒక గిన్నెల్లో చింతపండు తీసుకుని అందులో సరిపడా నీళ్లు పోసి  10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాత్రను పెట్టి అందులో సరిపడా నూనె పోసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి. ఇప్పుడు తాలింపులో ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి వేపాలి. తరువాత ఉడకబెట్టుకున్న చామదుంపలు కూడా వేయాలి ఆ తరువాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి అలాగే కారం, ధనియాలపొడి, గరం మసాలా పొడి కూడా వేసి ఒకసారి  కలపాలి.ఒక ఐదు నిముషాలు అయ్యాక నానబెట్టుకున్న చింతపండును తొక్కలు లేకుండా పిసికి ఆ రసాన్ని కూరలో పోయండి. సరిపడా చింతపండు రసం పోసిన తరువాత కూర మొత్తం ఒకసారి తిప్పి మూత పెట్టండి. కూర చిక్క బడిన తరువాత కొత్తిమీర తరగు వేసి పొయ్యి ఆఫ్ చేసేయండి.ఈ కూరను అప్పటికప్పుడు కాకుండా చల్లారాక తింటే బాగుంటుంది.ఎందుకంటే చామ దుంపలకు ఉప్పు,కారం,పులుసు బాగా పట్టి ముక్కలు టేస్టీ గా ఉంటాయి. !

మరింత సమాచారం తెలుసుకోండి: