మరణం  ఏవైపు నుంచి వస్తుందో  ఎవరికీ తెలియదు. ఒక్కోసారి అప్పటివరకు కళ్లముందు తిరిగిన వారు కొద్దిసేపటికే విగతజీవులుగా కనిపిస్తారు.  కొన్నిసార్లు చిన్నచిన్న పొరబాట్లే మనిషి ప్రాణాలు తీస్తాయి.ఆలా కబడ్డీ ఆట  ఓ యువకుడి  ప్రాణాన్నితీసింది ..  కబడ్డీలో గెలిచి  కప్పు తెస్తాడని అన్న  కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పటివరకు కోర్టులో చురుగ్గా  కదిలిన మిత్రుడు కుప్పకూలిపోవడాన్ని స్నేహితులు కూడా  జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఏమి జరిగింది కబడ్డీ ఒక మనిషి ప్రాణాన్ని తీయడం ఏంటి ?  అన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..

వివరాలలోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లా  కొండపేటకు చెందిన పెంచలయ్య,జయమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .  వీరి చిన్నకుమారుడు నరేంద్ర ఎం.కాం చదువుకున్నాడు. చిన్నతనం నుంచి కబడ్డీ అంటే నరేంద్రకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి వివిధ టోర్నీల్లో పాల్గొని ట్రోఫీలు కూడా  సాధించాడు.

అయితే ఈ క్రమంలో వల్లూరు మండలం, గంగాయపల్లెలో  నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీలో పోటీలో నరేంద్ర  పాల్గొన్నాడు. మ్యాచ్ మధ్యలో కూతకు వెళ్లిన నరేంద్రను ప్రత్యర్థులు అవుట్ చేసారు . పాయింట్ కోల్పోయిన అనంతరం తిరిగి కోర్టులోకి వస్తుండగా నరేంద్ర  అక్కడిక్కకడే  కుప్పకూలిపోయాడు. వెంటనే జట్టు సభ్యులు, అతడిని  ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే నరేంద్ర మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.  కొడుకు మృతిచెందిన  వార్త తెలియగానే  తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

అయితే నరేంద్ర కోర్టులో కూతకు  వెళ్లగా  అవతలి  జట్టు సభ్యులంతా ఒక్కసారిగా అతని  మీదపడటంతో  గుండెపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అనంతరం  తిరిగి వచ్చే క్రమంలో కోర్టులోనే  కుప్పకూలిపోయాడు ..  మొదట  నరేంద్ర నడుస్తుండగా జారిపడినట్లు అందరూ భావించారు. కానీ అతను చనిపోయాడని వార్త తెలిసి షాక్ కు గురయ్యారు. ఈ ఘటన పై నరేంద్ర తండ్రి  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: