ఆకతాయిల‌ వేధింపులకు తాళ‌లేక ఈశ్వరమ్మ అనే వివాహిత ఆత్మహత్యకు పాల్ప‌డింది. ఈ విషాద సంఘ‌ట‌న రంగారెడ్డి , రాజేంద్రనగర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి పుప్పాల గూడకు చెందిన  ఈశ్వరమ్మ అనే యువ‌తి ఇంట్లో ఎవ‌రూ లేని ‌ సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది . కొంత‌కాలంగా ఉన్యా నాయక్ అనే వ్య‌క్తి యువ‌తిని  పెండ్లి చేసుకోవాలంటూ త‌రుచూ వేధిస్తున్నాడు. 2 సంవత్సరాల క్రితం ఈశ్వరమ్మ పై కత్తితో దాడి చేసాడు భర్త రెడ్యా నాయక్. అప్పటి నుంచి ఈశ్వరమ్మ భర్తకు దూరంగా ఉంటోంది. ఈశ్వరమ్మ ఒంటరిగా ఉంటున్న నేపథ్యంలో ఆమెను పెళ్లి పేరుతో ఉన్యా నాయక్ వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈశ్వరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు.


ఇదిలా ఉండ‌గా వేధింపుల‌తో మ‌హిళ‌లపై జ‌రుగుతున్న నేరాలు దారుణంగా పెరుగుతున్నాయి. ఇండియాలో అత్యాచారాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఆడ వారిని ఆటబొమ్మలా చూస్తూ... కీచకులు రెచ్చిపోతున్నారు.  మహిళల భద్రత ఎంత డేంజర్ జోన్ లో ఉందో దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన నివేదిక చూస్తే.. దేశంలో ప్రతిరోజు సగటున 88 రేప్ కేసులు నమోదవుతున్నాయని వెల్లడించింది. 2018లో మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులు 3,78,236గా ఉండగా, 2019నాటికి ఆ సంఖ్య 4,05,861కి పెరిగింది. 2018తో పోలిస్తే 2019లో మహిళలపై నేరాలు 7.3% పెరిగాయని క్రైమ్స్ ఇన్ ఇండియా నివేదిక వెల్లడించింది. 2018లో నేరాలు 58.8 శాతం ఉంటే 2019నాటికి అది 62.4 శాతానికి పెరిగిందని, రేప్ కేసుల సంఖ్య 32,559 నుంచి 33,356కు పెరిగాయని పేర్కొంది.



2019లో మహిళలపై జరుగుతున్న నేరాల్లో చాలా వరకు... భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు చేస్తున్నవే 30.9 శాతం దాకా ఉన్నాయి. మహిళల స్వేచ్ఛను తట్టుకోలేక, పగ తీరా చేస్తున్న దాడుల నేరాలు 21.8 శాతం ఉన్నాయి. ఇక కిడ్నాపులు 17.9 శాతం ఉన్నాయని లెక్క‌లు చెబుతున్నాయి. మహిళలపైనే కాదు... పిల్లలపై జరుగుతున్న నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2018 నుంచి 2019కి ఇవి 4.5 శాతం పెరిగాయి. 2019లో పిల్లలకు వ్యతిరేకంగా... 1.48 లక్షల నేరాలు జరిగాయి. వీటిలో 46.6 శాతం... కిడ్నాపులు కాగా... 35.3 శాతం లైంగిక పరమైన నేరాలు.ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: