ఇటీవలి కాలంలో వాట్సాప్ వినియోగం ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకు కూడా వాట్సాప్ లోనే గంటలతరబడి కాలం గడుపుతున్నారు. మెసేజులు, కాల్స్, వీడియో కాల్స్ అంటూ వాట్సాప్ ను తెగ వాడేస్తున్నారు. ఇలా రోజురోజుకు వాట్సప్ వాడుతున్న వారి సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఇలా వాట్సాప్ ద్వారా ఎంతో మంది బాగా ప్రయోజనం పొందుతున్నారు. అయితే ఇదే వాట్సాప్ ని కూడా తమ ఆయుధంగా  మార్చుకుంటున్నారు సైబర్ నేరగాల్లు. వాట్సప్ వేదికగా ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు.



 ఎంతోమందికి చెందిన కీలక సమాచారాన్ని దొంగిలించి ఖాతాలు ఖాళీ చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వాట్సాప్ లో వచ్చిన ఒకే ఒక్క మెసేజ్ అతని జీవితంలో కనీవినీ ఎరుగని రీతిలో ఊహించని షాక్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు 40 లక్షలు సైతం పోగొట్టుకునే పరిస్థితిని తీసుకువచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. బాధితుడు లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. షేర్ లింగంపల్లి కి చెందిన 38 ఏళ్ల వ్యక్తికి వాట్సాప్లో ఇటీవలే +447901695636 ఈ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది.



 ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు పొందవచ్చు అంటూ ఈ మెసేజ్ లో ఆంతర్యం ఉంది. ఈ మెసేజ్కి ఆకర్షితుడయ్యాడు బాధితుడు. దీంతో వెంటనే రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత ఇక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ కు సంబంధించిన ఒక లింకు పంపించారు. దీంతో వెనకా ముందు ఆలోచించకుండా ఏకంగా 50 వేల రూపాయలను లింక్ ఓపెన్ చేసి ఇన్వైట్ చేసాడు. అంత లోనే 12,000 లాభం వచ్చింది. ఇక మరో బ్యాంకు ఖాతా నుంచి కూడా ఐదులక్షల ఇన్వెస్ట్  చేయమని అడగగా చేసాడు. అప్పుడు మరో 50 వేలు లాభం వచ్చింది. ఇలా క్రమక్రమంగా స్నేహితుల దగ్గర అప్పులు చేసి 40 లక్షలను పెట్టుబడిగా పెట్టగా ఇక పెట్టుబడి లాభం తో కలిసి రెండు కోట్లు గెలుచుకున్న ట్లు  వెబ్సైట్లో చూపించింది కానీ ఈ డబ్బులు విత్ డ్రా  చేసుకునేందుకు ప్రయత్నిస్తే అప్పుడు అసలు విషయం తెలిసింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: