ఇలా కట్టుకున్న వారికి తోడు నీడగా ఉండాల్సిన వారే మూడుముళ్ల బంధం తెంచుకోవడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. దారుణంగా కట్టుకున్న వారిని చంపేసి ఉన్మాదులు గా మారిపోతున్నారు. సాటి మనుషులు అయిన కాస్తయినా జాలి కూడా చూపించడం లేదు. నేటి రోజుల్లో ఇలా దాంపత్య బంధం ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది నేటి రోజుల్లో. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తాగుడుకు అలవాటు పడిన భర్త భార్యను వేధించడం మొదలుపెట్టాడు.
భర్త వేధింపులు భరించలేక భార్య అపర కాళిలా మారిపోయింది. దీంతో ఏకంగా భర్త మర్మాంగాన్ని కోసి దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మరిపెడ మండలం వాంకుతోడ్ తండాకు చెందిన బిచ్య అనే వ్యక్తి రోజూ తాగి వచ్చి వాడు. ఇక ఇటీవల కాలంలో ఎలాంటి పని చేయకుండా మద్యానికి బానిస గా మారిపోయాడు భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. సూటిపోటి మాటలతో వేధించే వాడు. ఇక ఇటీవల భార్య భర్త తీరుతో విసుగు చెందింది. నిన్న రాత్రి కూడా భర్త తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ప్రమీల భర్త మర్మాంగాన్ని కోసి హత్య చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి