కంచె చేను మేస్తోంది అనే సామెత దాదాపుగా అందరూ వినే ఉంటారు. అంటే చేనుకు రక్షణ కల్పించాల్సిన కంచె ఏకంగా చేను మేయడం అని దీని అర్థం వస్తుంది  ఇక్కడ జరిగిన ఘటనకు ఈ సామెత బాగా సరిపోతుంది అని చెప్పాలి. సాధారణంగా పోలీసులు అంటే అందరికీ రక్షణ కల్పించాలి. నేరాలను అరికట్టడానికి నిరంతరం శ్రమిస్తూ ఉండాలి   సభ్య సమాజం మొత్తం ప్రశాంతంగా ఉండడానికి ఎప్పుడూ విధి నిర్వహణలో నిమగ్నం అయిపోతూ ఉండాలి. కానీ ఇక్కడ కొంతమంది పోలీసులు మాత్రం కంచె చేను మేస్తోంది అన్న చందంగానే వ్యవహరించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు చివరికి వారితోనే చేతులు కలిపారు.


 కానీ చివరికి ప్లాన్ కాస్త బోల్తా కొట్టి పోలీసులు కటకటాల పాలయ్యారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పోలీసుల పనితీరుపై దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ కొంతమంది పోలీసులు మాత్రం అందరికీ మచ్చ తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. డబ్బు ఆశతో ఎన్నో అక్రమాలకు సహకరిస్తూ ఏకంగా నేరస్తులతో చేతులు కలపడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం గంజాయి మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. కానీ ఇటీవలే   కొంతమంది పోలీసులు మాత్రం మద్యం అక్రమ రవాణా చేస్తున్న వారితో చేతులు కలిపారు చివరికి కటకటాలపాలయ్యారు.


 నల్గొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధి అంతర్ రాష్ట్ర సరిహద్దు కావడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు తెలంగాణ ఆంధ్ర పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే ఈ చెక్పోస్టులను తప్పించుకొని మరికొంతమంది తెలంగాణ నుంచి ఏపీకి మద్యం అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే మద్యం అక్రమ రవాణా చేయాలని అనుకున్నారు. ప్రైవేటు వాహనంలో చేస్తే దొరికిపోతాము. అందుకే పోలీస్ వాహనంలోనే తరలిస్తే ఇంకెవరు పట్టుకుంటారని సరికొత్తగా ప్లాన్ వేశారు. దీని కోసం పోలీసు పెట్రోలింగ్ చేసే కానిస్టేబుల్ ను రంగంలోకి దింపి పోలీస్ వాహనం ద్వారా ఏపీలో కి మధ్య అక్రమ రవాణా చేయాలనుకున్నారు. అయితే చెక్పోస్టుల వద్ద పోలీస్ వాహనం కావడంతో అంతగా పట్టించుకోలేదు పోలీసులు. కానీ ఏపీ లోని దాచేపల్లి మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద స్థానిక పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఇక ఈ కుట్ర పన్నిన నేరస్తులు వారికి సహకరించిన పోలీస్ లను కూడా అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: