ఇటీవల కాలంలో ఎక్కడచూసినా దొంగల బెడద కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అన్న విషయం తెలిసిందే. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది అంటే చాలు అందినకాడికి దోచుకో పోవడానికి పక్కా ప్లాన్ వేస్తున్నారు దొంగలు. ఈ క్రమంలోనే పోలీసులకు దొరకకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక చోరీ కేసును ఛేదించడం అటు పోలీసులకు కూడా రోజురోజుకు సవాలుగానే మారిపోతుంది  అయితే ఇటీవలి కాలంలో దొంగలు చోరీలకు  పాల్పడేందుకు సరికొత్త దారులు వెతుకుతూన్న ఘటనలు ఎన్నో సంచలనంగా మారిపోతున్నాయి.


 రెగ్యులర్గా అందరూ చేసే చోరీ లాగా కాకుండా వినూత్నమైన పద్ధతిలో చోరీలకు పాల్పడుతున్నారు ఎంతో మంది. వెరసి ఇంటి యజమానులు ఎంతలా జాగ్రత్తగా ఉన్నప్పటికీ దొంగల బారి నుంచి తప్పించుకోలేక పోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా దొంగలు చోరీకి పాల్పడిన సమయంలో బంగారు ఆభరణాలు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లాడం లాంటివి చూస్తూ ఉంటాము. కాని కొంత మంది దొంగలు మాత్రం కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఎన్ని విలువైన వస్తువులు పక్కన ఉన్నప్పటికీ కేవలం తమకు కావాల్సిన వస్తువులను మాత్రమే దొంగలించడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇలాంటి దొంగలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి చోరీ జరిగింది అని చెప్పాలి. గోదాం లోకి చొరబడ్డ దొంగలు ఏకంగా చాక్లెట్లు దొంగలించారు. అయ్యో అంతా కష్టపడి చాక్లెట్లు దొంగలించారా అని అనుకుంటున్నారు కదా.. అలా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఇక్కడ దొంగలు 17 లక్షల విలువైన క్యాడ్బరీ చాక్లెట్లు ఎత్తుకెళ్ళడం సంచలనంగా మారింది. ఉత్తర ప్రదేశ్లో వెలుగు లోకి వచ్చింది ఈ ఘటన. లక్నో లోని చింహత్ ప్రాంతం లో  ఈ ఘటన వెలుగు లోకి రాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: