
సెక్యూరిటీ గార్డు లే లక్ష్యంగా చేసుకుని దారుణమైన హత్యలకు పాల్పడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ ఘటన కాస్త పోలీసులు సైతం అవాక్కయ్యేలా చేసింది అని చెప్పాలి. ఇక హత్య గురైన ఓ వ్యక్తి వద్ద దొంగలించిన ఫోన్ ఆధారంగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలోనే అతను చెప్పిన విస్తుపోయే నిజాలు విని ప్రతి ఒక్కరూ అవాక్కయ్యారు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాగర్ కు చెందిన శివ ప్రసాద్ అనే 19 ఏళ్ల యువకుడు విపరీతంగా సినిమాలు చూస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూసి శివప్రసాద్ ఎంతగానో ప్రభావితం అయ్యాడు. సినిమాలో లాగానే నేరాలు చేస్తూ ఫేమస్ అవ్వాలని భావించాడు. ఈ క్రమంలోనే సాగర్ నగరంలో మూడు రాత్రుల్లో వరుసగా ముగ్గురు సెక్యూరిటీ గార్డులను దారుణంగా హతమార్చాడు. ఇక మే నెలలో కూడా ఒక వ్యక్తిని చంపాడు. నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డులపై యువకుడు దాడులకు పాల్పడుతూ ఉండేవాడు. అయితే గత రాత్రి భోపాల్లో ఓ మార్బుల్ దుకాణం వద్ద కాపలా ఉన్న సెక్యూరిటీ గార్డు సోను వర్మపై మార్బుల్ రాయితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. మృతుడి సెల్ఫోన్ కనిపించకపోవడంతో సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని విచారించగా అతను చేసిన హత్యలకు సంబంధించిన నిజాలు బయటపడ్డాయి.