పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక తమ పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ఎంతో మంది ఇష్టపడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో అందరిలా కాకుండా కాస్త భిన్నంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఎంతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. ఇక తమ తాహతకు మించి ఖర్చు పెడుతూ పెళ్లిని మరింత ప్రత్యేకమైన ఈవెంట్ గా మార్చుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇలా పెళ్లిళ్లలో ఏదైనా వినూత్నంగా ప్రయత్నించారు అంటే చాలు అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 కొంతమంది విషయంలో ఇలా జరుగుతూ ఉంటే..  ఇంకొంతమంది విషయంలో మాత్రం పెళ్లి ఇష్టం లేకపోయినప్పటికీ కేవలం పెద్దల ఒత్తిడి కారణంగానే వైవాహిక బంధం లోకి అడుగుపెడుతున్నారు ఎంతో మంది. తద్వారా కొంతమంది ఇక పెళ్లి తర్వాత కట్టుకున్న వారితో కలిసి జీవించలేక మనస్థాపనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సవ్యంగానే ఉండి ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పరారవుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో ప్రేమ పేరుతో నమ్మించి ఇక పెళ్లి పేరుతో మూడు ముళ్ళు వేసి కొన్నాళ్లకే ముఖం చాటేస్తున్న వారు కూడా నేటి రోజుల్లో చాలామంది ఉన్నారు .

 ఇక ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ప్రేమ పేరుతో మొదట వెంటపడ్డాడు.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు. ఇక ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లయిన మరునాడు కనిపించకుండా పరారయ్యాడు. ఈ ఘటన మనోహరాబాద్ మండలం ధర్మాజు పల్లి లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. యశ్వంత్ రెడ్డి అనే 23 ఏళ్ల యువకుడు తేజశ్రీ అనే యువతని రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకునేందుకు వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పగా.. కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు. ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకొని తూప్రాన్ పట్టణంలో కాపురం పెట్టారు. అయితే పెళ్లయిన మరునాడే కంపెనీ విధులు ఉన్నాయంటూ చెప్పి వెళ్లిన యశ్వంత్ రెడ్డి మళ్ళీ ఇంటికి రాలేదు. దీంతో భయపడిపోయిన తేజశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: