ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి  అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా కూడా అది నిమిషాల వ్యవధిలో  సోషల్ మీడియాలో వాలిపోతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కడో జరిగిన ఘటనలను కూడా ఎంతో వేగంగా తెలుసుకోగలుగుతున్నారు అందరూ. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. నిజంగా ఇలా జరుగుతుందా అని ఇక  ఘటనల గురించి తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో ఒక అనుమానం కలుగుతుంది అని చెప్పాలి.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన  సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా ప్రతి ఇంట్లో దోమలు బెడదా ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రంధ్రం ద్వారా దోమలు ఇంట్లోకి ప్రవేశించి ఇక మనుషులను కుట్టడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని ఇళ్లల్లో దోమలు బెడదా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే కొంతమంది ఇక దోమలు కుట్టడం ద్వారా మలేరియా టైఫాయిడ్ లాంటి వ్యాధుల బారిన పడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.


 ఇలా దోమలు కుట్టడం ద్వారా ఏకంగా వ్యాధుల బారిన పడటం చూసాము. కానీ ఏకంగా ఒక దోమ కుట్టడం ద్వారా కోమలోకి వెళ్ళిన ఘటన ఇక్కడ వెలుగులోకి వచ్చింది. అది కూడా నెలరోజుల పాటు కోమలోనే ఉన్నాడు. ఆ తర్వాత 30 సర్జరీలు చేయించుకునే పరిస్థితి కూడా ఏర్పడింది అని చెప్పాలి. జర్మనీలో ఈ విచిత్రమైన ఘటన జరిగింది. సెభాష్టియన్ అనే 27 ఏళ్ల వ్యక్తికి ఆసియా టైగర్ దోమ కుట్టడంతో సాధారణ జ్వరం వచ్చింది. కొన్ని రోజులకు రక్తం విషంగా మారింది. కాలేయం కిడ్నీ గుండె ఊపిరితిత్తులు సరిగా పనిచేయలేదు. దీంతో నాలుగు వారాలు కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక దోమ కుట్టిన చోట ఏర్పడ్డ గడ్డను తొలగించుకునేందుకు 30 సర్జరీలు  చేసుకుని చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: