ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించి భారీగా చలాన్లు వేస్తూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు లేకపోయినా ఇక ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా పోలీసులు వేసిన ట్రాఫిక్ చలానా ఏకంగా ఇద్దరు దంపతుల మధ్య చిచ్చు పెట్టింది అంటే నమ్ముతారా. అదేంటి ట్రాఫిక్ చలాన్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవ రావడం ఏంటి వినడానికే ఇదేదో విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.
ఏకంగా ట్రాఫిక్ చలాన్ భర్త అక్రమ సంబంధాన్ని బయటపెట్టింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కిలో వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 25వ తేదీన ఓ వ్యక్తి బైక్ పై హెల్మెట్ లేకుండా మరో యువతీతో ప్రయాణించాడు. ఇక సీసీ కెమెరాలు ఫోటో తీసాయ్. అయితే ఆ బండి అతని భార్య పేరు మీద ఉంది. మెసేజ్ వచ్చింది ఏంటా అని ఓపెన్ చేస్తే భర్త వేరే అమ్మాయితో కనిపించాడు. ఇదేంటి అని భార్య భర్తను నిలదీసింది. అయితే తాను కేవలం లిఫ్ట్ మాత్రమే ఇచ్చాను అంటూ భర్త చెప్పాడు. దీంతో ఇలా ట్రాఫిక్ చలాన్ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి