రెప్పపాటు కాలంలో అతని ఫోన్ దొంగలించాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు దొంగలు రెచ్చిపోయారు. మైలవరంలో శాంసన్ అనే ఒక రిటైర్డ్ ఉద్యోగి కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి గ్యాస్ కంపెనీ ఆఫీస్ కి వెళ్ళాడు. అక్కడ అతని బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్తుండగా అటుగా వేగంగా వచ్చిన ఒక యువకుడు బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. అయితే అక్కడే ఉన్న శ్యామ్సన్ ఇక యువకుడు బైక్ లేపడానికి ఇబ్బంది పడుతున్నాడు అనే విషయాన్ని గ్రహించి సహాయం చేయడానికి వెళ్ళాడు.
అయితే శాంసన్ ఇలా యువకుడికి సహాయం చేసి బైక్ లేపడానికి వెళ్లగా ఇక వారికి హెల్ప్ చేయడానికి మరో యువకుడు అక్కడికి పరుగున వచ్చాడు. ఇక శాంసన్ పక్కనే నిలబడి బైక్ లేపుతూ సహాయం చేశాడు. ఇక ఆ తర్వాత ఇద్దరు యువకులు కూడా తమకు సహాయం చేసిన శ్యాంశాన్ కి థాంక్స్ చెప్పి అదే బైక్ పై అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్యాస్ కంపెనీలోకి వెళ్తూ తన జేబులో చేయి పెట్టాడు శాంసన్. ఇంకేముంది ఒక్కసారిగా అవ్వక్కయ్యాడు. ఎందుకంటే షర్టు జేబులో ఉండాల్సిన సెల్ ఫోన్ మాయమైంది. అప్పుడు కానీ అతనికి అర్థం కాలేదు బయట జరిగిన తతంగమంతా ఒక డ్రామా అని. చివరికి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు శాంసన్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి