ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారిపోయిన అంశం ఒక్కటే అది టమాట. భారీగా పెరిగిపోయిన టమాటా ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇక టమాటా కిలో ధర చూస్తే కేవలం సంపన్నులకు మాత్రమే టమాటా అందుబాటులో ఉంది. సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉంది అన్నది అర్థమవుతుంది. సరే కొన్నాళ్లపాటు టమాటా ధరలు పెరిగాయ్. మళ్లీ తగ్గుతాయి కదా అని సామాన్యులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే అటు భూముల ధరలు పెరిగినట్లు టమాటా ధరలు కూడా అంతకంతకు పెరిగిపోతున్నాయి కానీ ఎక్కడ తగ్గడం లేదు. మొన్నటి వరకు 100 నుంచి 150 రూపాయలు వరకు పలికిన టమాట ధర ఇప్పుడు ఏకంగా 200 రూపాయలకు చేరుకుంది.



 దీంతో సామాన్య ప్రజలు బెంబేలు ఎత్తిపోతున్నారు. టమాటా లేకుండానే రోజువారి వంటలను కానిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో టమాటా రైతులు కోటీశ్వరులుగా మారిపోతూ ఉండటం చూస్తున్నాం. అంతేకాదు టమాటా దొంగతనాలు.. టమాటాను కాపాడుకునేందుకు నాగుపాములను కాపలాగా పెట్టడం లాంటి ఘటనలు కూడా సోషల్ మీడియాలో వెలుగులోకి  వచ్చాయి. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన అయితే ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. ఏకంగా ఒడిశాలో షాకింగ్ అటన వెలుగు చూసింది. ఒక వ్యాపారి వద్దకు వచ్చి 14 కిలోలు టమాటాలు కొన్న వ్యక్తి ఇవ్వటానికి డబ్బులు లేక చివరికి ఇద్దరు పిల్లలను తాకట్టు పెట్టి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.


 కటక్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది  వాషింగ్ మిషన్ కొనుగోలు చేశానని దాన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు కూలీలు కావాలని 300 ఇస్తానని చెప్పి ఇద్దరూ మైనర్లను తీసుకువెళ్లాడు ఓ వ్యక్తి. అది నమ్మి ఇద్దరు పిల్లలు అతనికి కూడా వెళ్లారు. అయితే సదరు వ్యక్తి దారి మధ్యలోనే చట్రా బజార్లో నాలుగు కిలోలు  టమాటలు కొన్నాడు. తర్వాత మరో 10 కిలోలు కావాలని కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదని చెప్పాడు. ఆ మాటలు కూరగాయల వ్యాపారి నమ్మాడు.  14 కిలోల టమాటాలను కలిపి ఒకేసారి ఇస్తానని చెప్పాడు. నమ్మకపోతే నా పిల్లలను nee దగ్గరే ఉంచుతాను డబ్బులు తీసుకెళ్తాను అంటూ నమ్మించాడు. అతను చెప్పింది నిజమే అనుకొని నమ్మాడు దుకాణం యజమాని. దీంతో పిల్లలని టమాటా వ్యాపారి దగ్గర ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. 2 గంటలైనా అతను తిరిగి రాకపోవడంతో మీ నాన్న తిరిగి రాలేదు ఏంటి అని పిల్లలను అడిగితే.. అతను మా నాన్న కాదు అంటూ సమాధానం చెప్పారు. జరిగిన విషయం చెప్పడంతో  కూరగాయల వ్యాపారి షాక్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: