తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి జీవితం మొదలవుతుంది. ఇక ఈ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతు ఉంటాయి. అయితే ఇలా సాగిపోతున్న జీవితానికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది అన్నది మాత్రం ఎవరు ఊహకందని  రీతిలోనే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది అనూహ్యమైన ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతుంటే.. ఇంకొంత మంది మాత్రమే ఏకంగా చేతులారా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఆ యువతి  ఎంతో తెలివైనది. ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇక ఇటీవల పరీక్షల్లో కూడా పాస్ అయింది. ఈ క్రమంలోని ఒకేసారి మూడు ప్రభుత్వఉద్యోగాలు సాధించింది.


 మరికొన్ని రోజుల్లో కేరళలోని సిఐడి విభాగంలో ఆ యువతి చేరాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.ఏకంగా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది.  ఈ ఘటనతో తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . ఈ ఘటన రాజస్థాన్లోని హనుమాన్ఘాట్ లో జరిగింది. ప్రియాంక అనేది అమ్మాయి బాలికల హాస్టల్ లో ఉంటూ యూపీఎస్సీ కి ప్రిపేర్ అవుతుంది. చిన్నప్పటి నుండి చదువుపై మక్కువ ఉన్న ఈ అమ్మాయి మొదటి ప్రయత్నంలోనే మూడు ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఇక మరికొన్ని రోజుల్లో తిరువనంతపురం వెళ్లి సిఐడిలో చేరాల్సి ఉంది. కానీ హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంది.


 ఆమె సడన్గా ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఎవరికి అర్థం కాలేదు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు  తమ కూతురు ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని.. ఇక ఈ ఘటనపై విచారణ జరిపి అసలు నిజాలు బయటపెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐఏఎస్ కావాలి అనే పట్టుదలతో ఆమె హాస్టల్లో ఉండి చదువుకుంటుందని.. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కావట్లేదని.. తండ్రి శివకరణ్ బోరున విలపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: