ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. దీంతో సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా పోయింది అని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో అటు సెలబ్రిటీలకు సామాన్యులకు మధ్య తేడా ఏదైనా ఉంది అంటే అది కేవలం పేరు పక్కన ఉండే బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే సెలబ్రిటీలు ఏదైతే సోషల్ మీడియాలో చేయగలుగుతున్నారో.. సామాన్యులు కూడా అది చేయగలుగుతున్నారు. ఇక తమకు నచ్చింది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకోవడంలో సామాన్యులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇలా వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే   సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. అయితే ఇటీవల కాలంలో పిల్లలు పెళ్లి విషయంలో కాస్త లేటుగానే ఆలోచన చేస్తూ ఉన్నారు. సాధారణంగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంతమంది మ్యాట్రిమోనీ సైట్లలో సంబంధాలు వెతుకుతుంటారు. ఇంకొంతమంది రెగ్యులర్ ఫార్మాట్లో ఇక పెళ్లిచూపులు నిర్వహించడం చేస్తూ ఉంటారు.


 మంచి చెడులు మాట్లాడుకుని ఇక పెళ్లి కుదుర్చుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఎంతకీ పెళ్లి కావట్లేదు అని వినూతమైన ఆలోచన చేశాడు. ఏకంగా ఒక బ్యానర్ కట్టి తన బాధను వ్యక్తం చేశాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలోని చీరాలలో వెలుగు చూసింది. నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయి ఎవరైనా.. మొబైల్ నెంబర్ ఇక్కడ నమోదు చేసి రోజు కలవగలరు. కులం పట్టింపు లేదు. నమ్మకం లేని వారు దయచేసి వివరాలు ఇవ్వోద్దు. పెళ్లి చేసుకోవడానికి నాకు అమ్మాయి కావాలి. ఇది వ్యాపారం కాదు దయచేసి నా సమయాన్ని వృధా చేయకండి  అంటూ రాసి ఉన్న ఒక ఫ్లెక్సీ ని అయ్యప్ప కుమార్ అనే యువకుడు ఏకంగా రోడ్డు మీద ప్రదర్శించడం కాస్త హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: