ఇటీవల బెంగళూరులో జరిగిన బాంబు బ్లాస్ట్ తో ఏకంగా ఆ నగరం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అన్న విషయం తెలిసిందే. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో ఏకంగా బాంబు దాడి జరిగింది. ఇక ఈ బాంబు దాడిలో ఎంతోమంది తీవ్ర గాయాల పాలు అయ్యారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ బాంబు దాడి జరిగిన సమయంలో అటు రామేశ్వరం కేఫ్ లోనే ఉన్న 24  ఏళ్ళ ఒక యువకుడు మాత్రం ఏకంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకోగలిగాడు. అయితే తాను ఇలా బాంబు పేలుడు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కారణం ఏకంగా తన అమ్మ నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ అని ఇటీవల అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు సదరు యువకుడు.


 అయితే సాధారణంగా తల్లి పిల్లలకు జన్మనివ్వడమే కాదు ఎప్పుడు కంటికి రెప్పలా కాచుకుంటుంది. ఇక పిల్లలకు ఏ కష్టం వచ్చినా కూడా అపరకాలిలా మారిపోయి ఆ సమస్యను తరిమికొడుతుంది అని చెప్పాలి. అయితే ఇక్కడ ఓ తల్లి తాను తన కొడుకుకు దగ్గరగా లేకపోయినా ఏకంగా కొడుకు ప్రాణాలను మాత్రం రక్షించలేకపోయింది. ఆ సమయంలోనే కొడుకుకి ఫోన్ చేయాలని ఆ తల్లికి ఎందుకు అనిపించిందో లేదంటే ఇక ఆమె మనసు ఏదైనా కీడు శంకించిందో తెలియదు. కానీ బాంబు పేలడానికి కొన్ని నిమిషాల ముందే కొడుకుకు ఫోన్ చేసింది. తల్లితో ఫోన్ మాట్లాడడానికి కాస్త పక్కకి వచ్చి నిలబడ్డాడు యువకుడు. అంతలోనే బాంబ్ బ్లాస్ట్ జరిగింది.


 ఇలా తల్లి తన కొడుకుకి ఒక దగ్గరగా లేకపోయినా ఏకంగా ఫోన్ కాల్ ద్వారా ప్రాణాలను కాపాడగలిగింది. ఇటీవల ఈ అనుభవాన్ని ఒక టెకీ పంచుకున్నాడు. 24 ఏళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుమార్ అలంకృత్ పేలుడు సమయంలో ఘటన స్థలంలోనే ఉన్నాడట. అయితే సరిగ్గా బాంబు పేలడానికి పది నిమిషాల ముందు తన తల్లి నుంచి ఫోన్ రావడంతో కేఫ్ నుంచి పది మీటర్లు దూరంగా వెళ్ళాడట  ఇక ఆ సమయంలోనే బాంబు పేలడంతో భయభ్రాంతులకు గురయ్యాడని తన తల్లి ఫోన్ చేయకపోయి ఉంటే ప్రాణాలు పోయేవి అంటూ చెప్పుకొచ్చాడు కుమార్ అలంకృత్.

మరింత సమాచారం తెలుసుకోండి: