ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరికి కూడా పాట్లు మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎండ వేడి మీద తట్టుకోలేక జనాలు అల్లాడిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఎంతలా ఏసీలు,ఫ్యాన్లు, కూలర్లు ఆన్ చేసుకున్న ఎండవేడికి చెమటలు పట్టేస్తూనే ఉంటాయి అని చెప్పాలి. దీంతో ఈ ఎండాకాలం ఎప్పుడు పోతుంది రా బాబు అని ప్రతి ఒక్కడు కూడా నెత్తి నోరు బాదుకుంటూ ఉంటారు. ఇక మధ్యాహ్నం అయింది అంటే చాలు భగభగ మండుతున్న సూర్యుడిని చూసి ఇక ఇల్లు లేదా ఆఫీసు నుంచి కాలు బయటపెట్టాలంటేనే ప్రతి ఒక్కరు కూడా భయపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ప్రస్తుతం ఎండాకాలం ఇంకా పూర్తిగా మొదలవ్వనే లేదు అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఇక ఎండ వేడిమి కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఫ్యాన్లు కూలర్లు ఏసీల ముందు కూర్చొని కాస్త సేద తీరాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎండాకాలం వచ్చిందంటే చాలు స్నానం చేయడానికి బద్ధకం ఉన్న వారు కూడా ఇక రోజుకి రెండు సార్లు స్నానం చేస్తుంటారు. ఉదయం స్నానం చేసి ఆఫీస్కు వెళ్లినవారు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే మళ్లీ స్నానం చేయడం చేస్తూ ఉంటారు. ఇలా ఎండాకాలంలో రోజుకు రెండుసార్లు స్నానం చేయకపోతే వేడి కారణంగా వచ్చిన చెమటతో చిరాకుగా అనిపిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు.


 ఇక్కడ జనాల పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఎండాకాలంలో రోజుకు రెండుసార్లు కాదు కనీసం ఒక్కసారి స్నానం చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. అది ఎక్కడో కాదు ప్రస్తుతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న బెంగళూరులో. అక్కడ ఉన్న పరిస్థితులతో ప్రజలు ప్రతి నీటిబొట్టును ఎంతో జాగ్రత్తగా వాడుకుంటున్నారు. ఎండాకాలం అయినప్పటికీ వారానికి ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తున్నట్లు నగరవాసులు చెబుతున్నారు. ఇక వంటకు ఎక్కువ నీళ్లు అవసరం పడుతుండడంతో.. ఆహారాన్ని బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. భూగర్భ జలాలు ఎండిపోవడంతో అక్కడ నీటి ఎద్దడి మొదలవ్వగా ఎండలు ముదిరే కొద్దీ పరిస్థితులు మరింత దారుణంగా మారే అవకాశం ఉందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: