అక్కడ ప్రరీస్థీతులు దారుణంగా తయారయ్యాయి .   ఇంటిని ఇంటిని చక్క పెట్టుకోవడమే కష్టమైంది .. కుటుంబానికి కడుపునిండా తిండి పెట్టాలని ఆలోచనలో .. పలువురు అమ్మాయిలు ఏజెంట్‌ల‌ను ఆశ్రయించి అతని సూచనలతో దేశ సరిహద్దు దాటి మహారాష్ట్రలోని పూణేకి వెళ్లి నకిలీ గుర్తింపు కార్డులు సంపాదించి .. బ్యూటీ పార్లర్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన దళారీ మాటలు నమ్మి.. అలా దళారులు 20వేలకు విక్రయించి వ్యభిచార  కోపంలోకి నెట్టేస్తున్నారు ..  అలా ఓ మహిళ అక్కడ నుంచి తప్పించుకుని ఓ అమ్మాయి సహాయంతో హైదరాబాద్ కు వచ్చింది .. ఇక్కడ కూడా ఆ మహిళ ఆమెను అదే రుచుల్లోకి నెట్టేశారు .. రీసెంట్గా హైదరాబాద్ పోలీసుల తనిఖీలలో పట్టుబడిన ఓ బంగ్లా యువతి పరిస్థితి ఇది .


తమ దేశంలో పూట గడటం కష్టంగా మరిన్న ఎంతోమంది బంగ్లాదేశ్ యువతులు , మహిళలు దళారీల చేతికి చిక్కి వ్యభిచార వృత్తిలో నరకం అనుభవిస్తున్నారు .. ఇలా హైదరాబాదులో పట్టుబడిన 20 మంది విదేశీ యువతలు ఉద్యోగం ఇప్పిస్తామంటే నమ్మి వచ్చామంటూ చెప్పుకొచ్చారు .. అలాగే ప్రధాన నగరాల్లో మకాం వేసిన బంగ్లా ఏజెంట్లు పెద్ద కుటుంబాల నిస్స‌హియ‌తను ఆసరా చేసుకుని సాగిస్తున్న దారుణాలు నగర పోలీసులు దర్యాప్తులో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి .. అలా వచ్చిన సమాచారం తో ప్రధాన సూత్రధారులపై పోలీసులు గురిపెట్టారు .



ప్రధానంగా బంగ్లాదేశ్ మరోపక్క పశ్చిమ బెంగాల్లోని చీకటి ముఠాలను ఏజెంట్లకు కమిషన్ ఆశ చూపి బంగ్లాదేశ్ అమ్మాయిలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని ఎర వేస్తున్నారు .. అలాగే వారిని దొంగచోటగా పశ్చిమబెంగాల్ , త్రిపుర , ఆసోం తీసుకువస్తున్నారు.   అలా ఒక్కో అమ్మాయికి 25వేల నుంచి లక్ష వరకు వేలం పెట్టి వ్యభిచార గృహాల నిర్వాహకులకు అమ్మేస్తున్నారు .. అలాగే ముంబై , పూణే , అహ్మదాబాద్ , సూరత్ , హైదరాబాద్ , బెంగళూరు , చెన్నై , కోయంబత్తూర్ వంటి మహా నగరాలకు తీసుకుపోతున్నారు .



ఇందులో అమ్మాయిల ఫోటోలను దళారులు నిర్వాహకులకు పంపుతారు వాటిని చూశాక వారు తమ ధరను నిర్ణయిస్తారు . అలా ఆయా ప్రాంతాలకు చేరవేసేందుకు ఒక్కో అమ్మాయికి రెండు , మూడు వేలు ఏజెంట్లకు కమిషన్ గా ఇస్తున్నారు .. అలాగే బ్యూటీ పార్లర్ , హోటల్ లో ఉద్యోగం అంటూ తీసుకువస్తున్నాడు కొందరిని స్పా  కేంద్రాల నిర్వహకులకు అప్పగిస్తున్నారు .. మరి కొందరిని నగరంలో రోజుకు ఒక ప్రాంతం మార్చుతూ .. వారికి చుక్కలు చూపిస్తున్నారు .. ఈ దారుణమైన పరిస్థితి నుంచి కొందరు అమ్మాయిలు తప్పించుకునే ప్రయత్నం చేసిన కొత్త ప్రాంతం కావడంతో ఎటు వెళ్ళాలో తెలియక మళ్ళీ తిరిగి వారి వద్దకే వెళుతున్నారని పోలీస్ అధికారులు చెబుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: