
ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. విలువలు వలువలు విడిచి పారేస్తున్నారు. బంధాలకు కాలం చెల్లిపోయింది. వావి వరుసలకు సమాధి కట్టేస్తున్నారు. అక్రమ సంబంధాల మోజులో భార్యలు భర్తలను... భర్తలు భార్యలను హతమారుస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. కొన్ని నెల క్రితం ఒక రైతు తన ఇద్దరు కుమార్తెలకు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశారు. ఇద్దరు కుమార్తెలకు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మరదలు తన బావ ( అక్క భర్తతో ) ప్రేమలో పడింది. ఇద్దరు హద్దులు దాటేశారు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు తెలియడం తో ప్రశ్నించారు. ఒక రోజు ఇద్దరు పారిపోయారు.
వీరిని వెతికే క్రమంలో ఆ అమ్మాయి భర్త అయిన మరిది, ఆ పారిపోయిన అబ్బాయి భార్య అయిన వదిన మధ్య సాన్నిహిత్యం పెరిగి వారు ప్రేమ లో పడ్డారు. కొన్ని నెలలు వెతికిన అనంతరం వారు వారు పోతే పోయారు.. మనం పెళ్లి చేసుకుందాం అని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొద్ది నెలలకు పారిపోయిన వారిద్దరు తిరిగి వచ్చారు. వారు కూడా అప్పటికే పెళ్లి చేసేసుకున్నారు. చివరకు జరిగిందేదో జరిగిపోయింది. అని ఆ జంటలు భర్తలను మార్చుకున్నాం కదా.. అని పిల్లలను కూడా మార్చేసుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు అక్కడ స్థానికంగా వైరల్ గా మారింది. ఎంత విచిత్రమో కదూ..!
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.