ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఆరు పరిశ్రమలు ప్రారంభం కాబోతున్నాయి. అందులో ప్రముఖమైనది ఆహార శుద్ధి పరిశ్రమలు. ఈ ఆహార శుద్ధి పరిశ్రమలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. ఈ పరిశ్రమల ద్వారా రైతులు పండించే పంటలను స్టోరేజీ చేసేందుకు వీలవుతుంది. ముఖ్యంగా స్టోరేజీ వల్ల కూరగాయలు, ధాన్యం లాంటివి చెడిపోకుండా ఉండేందుకు ఈ పరిశ్రమల్లో నూతన టెక్నాలజీని ఉపయోగించి కట్టనున్నాను.


తద్వారా మార్కెట్లో ఆహార ధాన్యాల కొరత తీరనుంది. అదే సమయంలో రైతులకు గిట్టు బాటు ధర వచ్చినపుడు ఆయన దాన్ని అమ్ముకోవడానికి వీలవుతుంది. ముఖ్యంగా సామాన్యుడికి ధరల పెరుగుదలను నియంత్రించడంలో ఇవి తోడ్పడుతాయి. ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఎంత ముఖ్యమో, మంచి జరిగినపుడు కూడా దాన్ని ప్రజలకు తెలియజేయాలి. 3.14 లక్షల టన్నుల సామర్థ్యంతో ఈ పరిశ్రమను నిర్మించనుండగా 955 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందనున్నారు. పరోక్షంగా దాదాపు 40 వేల మందికి పైగా దీని మీద ఆధారం పొందే అవకాశం ఉంది.


420 కలెక్షన్ సెంటర్లు, 40 కిపైగా కోల్డ్ స్టోరేజ్ సెంటర్లు ఉండనున్నాయి. అయితే  వాస్తవంగా ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకం. రైతులు పంటలు కాపాడుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో 80 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 శాతం వరకు ఉంటుంది. ఇందులో పబ్లిక్ వాటా కూడా చేరుతుంది.


నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా  గోడౌన్లు పెంచి రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం ప్రధానమైన అంశంగా పెట్టుకున్నారు.  దీంతో రైతులు ఎక్కువ రోజులు తమ పంటలను కాపాడుకోవచ్చు. వర్షానికి, ఎండకు, చలికి పంటలను కాపాడుకునే రైతులకు ఈ ఆహార శుద్ది పరిశ్రమలు చాలా వరకు ఉపయోగ పడతాయి. వీటిని సరైన విధంగా ఉపయోగించుకునేలా రైతులకు సపోర్టు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: