ఎప్పుడూ చూడలేం అనుకున్న చంద్రబాబు అరెస్టు ను వైసీపీ శ్రేణులు చూసేశారు. ఎన్నడూ వినలేం అనుకున్న పదాలు కూడా వింటున్నారు. దీనిపై టీడీపీ నాయకులు మండిపడుతుండటం మనం ఏపీ రాజకీయాల్లో గమనిస్తున్నాం. గతంలో తాము తిట్టిన తిట్లను ఇప్పుడు తమనే తిడుతుండటంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో టీడీపీ శ్రేణులు ఉన్నారు. అప్పుడు వాళ్లు మాట్లాడిన మాటలే ధర్మం ఉంటుంది.. న్యాయం జరుగుతుంది అని ఇప్పుడు వీళ్లు మాట్లాడుతున్నారు.



ఈ కేసులో రిమాండ్ ఉండదని చంద్రబాబు మొదట్లో భావించారు. ఆ తర్వాత క్వాష్ అవుతుందని అనుకున్నా అదీ జరగలేదు. ఈ కేసులో ప్రాథమిక , ముఖ్యమైన ఆధారాలను సీఐడీ అధికారులు సంపాదించారు. కాబట్టి ఈ దశలో మేము జోక్యం చేసుకోలేము అని హైకోర్టు చెప్పింది. ఒకవేళ సుప్రీం కోర్టుకు వెళ్లినా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్లు నిరాకరించే అవకాశం ఉంది.



ఇప్పుడు తర్వాత అంశం రిమాండ్ రిపోర్టులో పేర్లు ఉన్న మాజీ మంత్రులు నారా లోకేశ్, గంటా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు లకు అరెస్టు తప్పదా అని. ఓ పక్క వైసీపీ మంత్రులు తర్వాత అరెస్టు అయ్యేది లోకేశ్ అని చెప్తున్నారు. ఒకవేళ ఈ కేసులో చంద్రబాబు బయటకి వస్తే తమకు పెద్ద ఎదురుదెబ్బే అవుతుందని వైసీపీ భావించింది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలవడం వైసీసీ కి ప్రతికూలాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధించడం వారికి కొంత ఉపశమనం లభించింది. ఇప్పుడు బెయిల్ వచ్చినా వైసీపీకి నష్టమేమి లేదు.



క్వాష్ కాకుండా బెయిల్ వస్తే నిందితుడిగా అంగీకరించినట్లే. శిక్ష పడాలంటే నేరస్థుడు అవ్వాలి. ఇప్పటికే సీఐడీ తొమ్మిది కేసులను సిద్ధం చేసింది. ఏ కేసులో ఎవరినీ అరెస్టు చేస్తారో అని  టీడీపీ మాజీ మంత్రులకు భయం మొదలైంది. దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మంది మాజీ మంత్రులకు జైలుకు వెళ్తానేమో అని ఆలోచిస్తూ లోలోపల సతమతం అవుతున్నారు. చూద్దాం ఏ జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: