విశాఖ పోర్టులో జరిగిన ప్రమాదంలో చాలా బోట్లు మంటల్లో కాలి బూడిదైపోయాయి. ఈ ప్రమాదంలో చాలా మత్య్సకార కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ సర్కారు వెంటనే స్పందించి కారకులను అరెస్టు చేయడమే కాకుండా బోట్లకు సంబందించి డబ్బులను కూడా ఆర్థిక సాయం అందజేసింది. అన్ని బోట్లకు సంబంధించి మొత్తం మీద రూ. 7 కోట్ల చెక్కులను వెంటనే విడుదల చేసింది. అందులో భాగంగా ఒక్కో బోటుకు సంబంధించి దాదాపు రూ.30 లక్షలు రానున్నాయి. దాదాపు 80 శాతం మేర మత్య్సకారులకు ఆర్థిక సాయం అందిస్తామని జగన్ ప్రకటించి వెంటనే చెక్కులను కూడా అందజేశారు.


ఇలా ప్రతి విషయంల వైసీపీ సర్కారు పేదలకు న్యాయం చేసేందుకు ముందుకు వెళుతుంది. దీంతో ప్రజల్లో సానుభూతిని తెచ్చుకుంటుంది. అయితే ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించి మత్య్సకారులకు రూ. 50 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు. పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే అక్కడికి వెళ్లి వారికి సాయం చేస్తూ ప్రజల్లో ఆదరాభిమానాలు పొందుతున్నారు.


మరి ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయినా టీడీపీ ముందుగా స్పందించాల్సిది పోయి అటు ప్రభుత్వం, ఇటు జనసేన సాయం చేసిన తర్వాత చివరగా స్పందించింది. టీడీపీ తరఫున విశాఖ పోర్టులో నష్టపోయిన మత్య్సకార కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సాయం చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంటే రాష్ట్రంలో ఎలాంటి విపత్తు సంభవించిన ముందుగా స్పందించాల్సిన నాయకులు అంతా జరిగిపోయిన తర్వాత స్పందించడంపై ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఇలా చేయడం వల్ల టీడీపీకి ఉన్న క్రెడిబిలిటీ దెబ్బ తింటుందని వాపోతున్నారు. ముఖ్యంగా బీసీలకు అనుకూలమైన పార్టీ ఇంత మంది బీసీలు మొత్తం నష్టపోయి రోడ్డున పడితే ఇప్పుడా స్పందించేది అని విమర్శలు చేస్తున్నారు. మరి దీనిపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: