ఔను.. వైసీపీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కాకుండా.. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. ఇంత‌మందిలో ఎవ‌రికీ లేని ప్ర‌త్యేకత‌.. ఒక ఎమ్మెల్యేకు మాత్ర‌మే ఉంది. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు.. చాలా డిఫ‌రెంట్ గురూ.. అనే టైపులో ఉంటారు. ఆయ‌నే చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నుంచి విజ‌యం ద‌క్కించుకున్న చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి... త‌ర్వాత కాలంలో చాలా డిఫ‌రెంట్ రాజ‌కీయాలు చేస్తూ..వ‌చ్చారు.. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న చెవిరెడ్డి.. జ‌గ‌న్ అంటే ప్రాణం పెడ‌తార‌నే పేరుంది.

క‌రోనా స‌మ‌యంలో అంద‌రికన్నా ముందుగానే.. ఆయ‌న‌నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల‌కు శానిటైజ‌ర్లు, మాస్కు లను భారీ సంఖ్య‌లో పంపిణీ చేశారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క ఇంటికీ.. నిత్యావ‌స‌రాల‌ను కూడా పంపిణీ చేశారు.. ఇక‌, ప్ర‌తి ఉగాది పండుగ‌కు.. నియొజ‌క‌వ‌ర్గంలోని మునిసిప‌ల్ కార్మికులు ఎంత మంది ఉన్నా.. వారికి బ‌ట్ట‌లు పెట్ట‌డంతోపాటు.. ఆర్థికంగా కూడా సాయం చేస్తున్నారు. ఇక‌, సీఎం నివాసంలో అనేక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌నే నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో గోశాల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను ఎమ్మెల్యేనే చూస్తున్నారు.

తాజా విష‌యానికి వ‌స్తే.. సాధారణంగా అంద‌రు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజ‌ర‌య్యారంటే.. అంతో ఇంతో టిప్ టాప్‌గా వ‌స్తారు. ఎందుకంటే.. అసెంబ్లీ స‌మావేశాల‌ను లైవ్‌లో చూపిస్తారు కాబ‌ట్టి.. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా చూస్తారు కాబ‌ట్టి.. వారికి తాము హుందాగా క‌నిపించాల‌నే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే.. చెవిరెడ్డి మాత్రం క‌నీసం కాళ్ల‌కు చెప్పులు కూడా ధ‌రించ‌కుండానే అసెంబ్లీకి రావ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఈ విష‌యాన్ని వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు స‌భ‌లో వివ‌రించారు.

టీడీపీ స‌భ్యుల‌పై విమ‌ర్శ‌లు చేసే స‌మ‌యంలో త‌మ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి గురించి ప్ర‌స్తావించిన అంబ టి.. ఆయ‌న క‌నీసం కాళ్ల‌కు చెప్పులు కూడా వేసుకోర‌ని అన్నారు. దీనికి కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే.. అసెం బ్లీని తాను దేవాల‌యంగా భావిస్తాన‌ని.. దేవాల‌యంలోకి వెళ్లేవారు.. చెప్పులు ఎలా అయితే.. బ‌య‌ట విడిచి వెళ్తారో.. తాను కూడా అంతేన‌ని స‌మాధానం చెప్పిన‌ట్టు అంబ‌టి వివ‌రించారు. మొత్తంగా ఈ ప్ర‌క‌ట‌న‌తో అప్ప‌టివ‌ర‌కు తెలియ‌ని వారు.. చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందించారు. సో.. ద‌టీజ్ చెవిరెడ్డి అంటూ.. వైసీపీ ఎమ్మెల్యేలు ఆయ‌న‌ను అభినందించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: