సెమీ కండక్ట్ చిప్ లను తయారు చేసే దేశాల్లో చైనా ముఖ్యమైన దేశం. తైవాన్, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాలు వీటిని తయారు చేస్తుంటాయి. అమెరికా చైనాను అప్ గ్రేడ్ వర్షన్ లో సెమీ కండక్ట్ చిప్ లను తయారు చేయొద్దని చెప్పింది. ఇప్పటికే వువాయ్ మీద చర్యలు తీసుకుంది. ఈ చిప్ లను సంబంధించి అసెంబ్లింగ్, టెస్టింగ్, ప్యాకేజీలకు చైనాను అనుమతించమని అమెరికా చెప్పింది.


ఇందులో కొత్త టెక్నాలజీని చైనాకు అమ్మకూడదని నాలుగు దేశాలు నిర్ణయించుకున్నాయి. వీటిని అమెరికా 54 శాతం, జపాన్ 6 శాతం, దక్షిణ కొరియా 22 శాతం, తైవాన్ 9 శాతం నూతన టెక్నాలజీ సెమీ కండక్ట్ చిప్ లను తయారు చేస్తున్నాయి. ఈ నూతన టెక్నాలజీ చిప్ లను చైనా కేవలం 4 శాతం మాత్రమే తయారు చేస్తున్నాయి. దీన్ని 66 శాతం మేరకు పెంచాలని డ్రాగన్ కంట్రీ భావిస్తోంది.


మేకింగ్ టూల్స్, చిప్ తయారీలో అత్యంత కీలకమైన వాటిపై అమెరికా నిషేధం విధించింది. నెదర్లాండ్ లో ఏఎస్ఎమ్ ఎల్ కు కూడా అమెరికా ఆదేశాలు జారీ చేసింది. నెదర్లాండ్ కూడా అమెరికా, జపాన్ తో చేతులు కలిపి ఈ చిప్ తయారీ వ్యవస్థలో ఉన్న కీలక అంశాలను వేరే దేశాలకు చెప్పకుండా ఉంటోంది. డీయూవీల మీద కూడా బ్యాన్ విధించారు.(డీయూవీ) డీప్ అల్ట్రా వయిలెట్ ఇథోగ్రపీ ఎక్విప్మెంట్ ను బ్యాన్ చేసింది. వీటన్నింటిని చైనా కు అమ్మవద్దని అమెరికా ఆదేశించింది.


ఇవి ఆటో మొబైల్ రంగానికి సంబంధించిన కీలకమైన భాగాలగా పనిచేస్తాయి. జపాన్ లో కూడా కెనాన్, టీఐకాన్, టోక్యో ఎలక్ట్రానిక్ విభాగం వారు కూడా వీటిని తయారు చేస్తుంటారు. వీరిని కూడా చైనాకు ఎగుమతి చేయొద్దని అమెరికా సూచించింది. మొత్తం మీద చైనాలో పరిశ్రమల్లో తయారీకి అమెరికా పరోక్షంగా అడ్డుకుంటుందన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: