దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని సీఎం జగన్ టీడీపీ, జనసేనకు బహిరంగంగానే సవాలు విసిరాడు. దీనికి ప్రతిగా మీరెవరూ మమ్మల్ని అన్ని స్థానాల్లో పోటీ చేయమని అడగటానికి అని పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు. ఈ దపా అసెంబ్లీలో కచ్చితంగా అడుగుపెట్టాలి. నన్ను నమ్ముకున్న వారందరూ అసెంబ్లీలో తమ వాయిస్ వినిపించాలని పవన్ చెబుతున్నారు.


అందుకే సీఎం జగన్ రెచ్చగొడుతున్న డైరెక్టుగానే 175 స్థానాల్లో పోటీ చేయం అని చెబుతున్నారు. ఏం చేయాలో నాకు తెలుసు. నేను ఏం నిర్ణయం తీసుకుంటానో తెలుసు. ఎలాంటి నిర్ణయం తీసుకున్న అమ్ముడు పోయానని అనద్దని ప్రజలను పవన్ కోరారు. రాష్ట్రాన్ని బాగు చేస్తాను. కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి జరిగేలా చూస్తానని చెప్పుకొచ్చారు.


ముందు స్పీచ్ అంతా  జనసేన ఒంటరి పోరాటం చేస్తుందనే చెప్పుకొచ్చేలా సాగింది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ న్యాయం చేస్తానని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ప్రయత్నించాలని అన్నారు. మీరంతా ఒంటరిగా పోటీ చేయమంటే సిద్ధమే. గ్రౌండ్ లెవల్లో జనసేన పార్టీ గురించి విస్తృత ప్రచారం జరగాలి. పదేళ్ల నుంచి పోట్లాడుతున్నాం ప్రజల్లో సానుకూల భావన ఉంటుంది. దాన్ని జన సైనికులు ఓట్ల రూపంలో రాబట్టాలి.


ఎలాగైనా సరే అసేంబ్లీలో జనసేన పార్టీ అడుగుపెట్టేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలి. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నా జనసేన నాయకులు, కార్యకర్తలు రెండున్నరేళ్లు సీఎం పదవి, సగం సీట్లలో పోటీ అంశం పైనే దృష్టి సారిస్తున్నారు. మొత్తంమీద  జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ ప్రజలకు కొంచెం అర్థమై, అర్థం కానట్లు, కులం, మతం అంటూ అందరికీ న్యాయం చేస్తానంటూ అప్పుడప్పుడు ప్రతిపక్షాలను విమర్శిస్తూ పవన్ ప్రసంగం సాగింది. పోటీ మాత్రం కలిసి చేస్తారా, చేయరా అనేది స్పష్టంగా చెప్పలేరు. పవన్ కల్యాణ్ అసేంబ్లీలో అడుగుపెట్టాలని దృఢంగానే కోరుకుంటున్నట్లు సభలో కనిపించింది మరి ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: