జగన్ - కేసీఆర్ ఇద్దరూ ఇద్దరే ! మొండితనానినికి, మంకుపట్టు పట్టడంలో ఇద్దరూ ఒకటే. తాము తీసుకున్న నిర్ణయం ఏదైనా వెనుకా ముందు చూడకుండా అమలుచేసి చూపడంలోనూ, రాజకీయ శత్రువులను ఎదుర్కుంటూ పై చేయి సాధించడంలోనూ జగన్ , కేసీఆర్ ఒకేరకమైన వ్యూహాలు, ప్రతివ్యూహాలర్తో ముందుకు వెళ్తుంటారు. అందుకేనేమో ఈ ఇద్దరి సీఎం ల మధ్య దోస్తీ బాగా కుదిరింది. ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకుంటూ, రెండు తెలుగు రాష్టాల మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకున్నారు. చిక్కుముడిగా ఉన్న మరెన్నోసమస్యలపై ఒక పరిష్కార మార్గాలను వెతుక్కుంటున్నారు. తమ ఉమ్మడి శత్రువుగా ఉన్న చంద్రబాబు ని ఒక ఆట ఆడుకుంటూ వస్తున్నారు ఈ ఇద్దరు మిత్రులు.

 

IHG's ...

 

ఈ స్నేహం ఇలా ఉండగానే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వివాదం మొదలయ్యింది. తెలంగాణ కు అన్యాయం చేస్తూ జగన్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు 203 జీవోని విడుదల చేశారు. దీంతో తెలంగాణ విపక్షాలు దీనిపై భగ్గుమన్నాయి. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించేలా జగన్ వ్యవహరిస్తున్నా, కేసీఆర్ నోరు మెదపడంలేదు అంటూ తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు భగ్గుమన్నాయి. దీంతో ఈ విషయంపై టీఆర్ఎస్ నాయకులూ గట్టిగానే స్పందించారు. తెలంగాణ కు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని, ఈ విషయంలో ఎవరైనా తమకు ఒక్కటే అంటూ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

IHG

 

తాజాగా ఈ జల వివాదం పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. మా ఇద్దరి మధ్య సఖ్యత బాగుంది, ఇకపై కూడా బాగుంటుంది అంటూ గులాబీ బాస్ కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఈ వివాదంలో చలి కాచుకునేందుకు తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, అలాగే ఏపీ లో సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టే విధంగా, ఇద్దరి మధ్య తగువు పెంచాలని చూస్తున్న విషయాన్ని గ్రహించిన కేసీఆర్ నిన్న మీడియా సమావేశం నిర్వహించి తాను చెప్పాల్సింది కుండబద్దలగొట్టినట్టుగా చెప్పేశారు. అసలు గోదావరి జలాలను రాయలసీమకు వాడుకోమని చెప్పింది నేనేనని, రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న, గోదావరిలో ఇంకో వెయ్యి టీఎంసీలు ఉంటున్నాయని, వాటిని తీసుకుందామని తాను చెప్పినట్లు వివరించారు.

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KCR' target='_blank' title='kcr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>kcr</a> vs Chandrababu in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELANGANA' target='_blank' title='telangana- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telangana</a>, courtesy attack on <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS JAGAN MOHAN REDDY' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> ...


 అనవసరంగా సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను రాయలసీమకు తరలించడంలో తప్పేమీ లేదని కేసీఆర్ అన్నారు. రెండు రాష్ట్రాలు సామరస్య పూర్వకంగా ఉంటేనే నదీ జలాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని,  కానీ నేను చెప్పిన విధంగా కాకుండా జగన్ వేరే విధంగా తెలంగాణ నీటిని వాడుకుంటామంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాము అంటూ కేసీఆర్ చెప్పారు. తమకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని, ఇందులో మరో ప్రశ్నకు తావులేదని కేసీఆర్ అన్నారు. అసలు ఏపీ తెలంగాణ మధ్య కిరికిరిలు పెట్టినవాడు చంద్రబాబేనని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ మాటలను బట్టి చూస్తే కొన్ని విషయాల్లో జగన్ తమకు శత్రువైనా, తమ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుందని, అందులో ఇంకో మాటకు తావు లేదని కేసీఆర్ అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: