అధికారంలో ఉంటే ఆ మజానే వేరు. తాము ఏమి చేసినా.. ఎందుకు చేసినా.. ఎలా చేసినా అడిగే వారు ఉండరు. అంతా నా ఇష్టం అన్నట్టుగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని నిర్ణయాలు అమలు అవుతాయి. జిందాబాద్ లు ,జై జై లు , ఆహా ఓహో లు ఇవన్నీ అధికారం ఉన్నన్ని రోజులు కనిపించేవి, వినిపించేవి. కానీ ఒక సారి అధికారం దూరం అయితే అప్పుడు గాని అసలు వాస్తవం ఏంటో తెలియదు. అధికారంలో ఉన్న సమయంలో మసిపూసి మారేడు కాయ చేసినా, అధికారం పోయిన తర్వాత ప్రభుత్వంలో చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రజల్లో అవమానానికి గురవడం, చేసిన తప్పును చేయలేదని వాదించడం, నిత్యం టెన్షన్ టెన్షన్ గా గడుపుతూ ఎప్పుడూ ఏ అవినీతి కేసు బయట పడుతుందో అనే టెన్షన్ తో గడపడం ఇప్పుడు ఇవన్నీ తెలుగుదేశం పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు. 

IHG


తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడంతోపాటు, ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టి ఆ పార్టీని ఉనికిలో లేకుండా చేయాలనే విధంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు. అయితే దీని కోసం ఆయన ప్రత్యేకంగా  కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనే కంటే, గత టీడీపీ ప్రభుత్వం లో నెలకొన్న అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తూ, పక్కా ఆధారాలతో, వాటిని బయట పెట్టి ప్రజల్లో దోషిని చేస్తూ అరెస్టు చేస్తున్న తీరు టీడీపీకి ఇప్పుడు ఇబ్బందికరంగా మారింది. వాస్తవంగానే గత టిడిపి ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, వారిని అదుపు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి.

 

IHG

 

 పార్టీ నాయకులకు మేలు చేయడంతో పాటు, పార్టీని కూడా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడిపించాలంటే అవినీతికి గేట్లు ఎత్తి వేయడమే మార్గంగా అప్పట్లో టిడిపి అధినేత చంద్రబాబు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కో కీలకనేత అవినీతి కేసులను బయటకు తీస్తూ, ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఎప్పుడు ఏ కేసులో అరెస్ట్  చేస్తారో, తమ పరిస్థితి ఏంటో తెలియక చాలామంది సతమతపోతున్నారు. మరి కొంతమంది పార్టీ మారితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అనే ఉద్దేశంతో ఉన్నారు. 

 

IHG's son <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NARA LOKESH' target='_blank' title='nara lokesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>nara lokesh</a> sworn in as ...


చాలామంది టిడిపి కీలక నాయకులంతా ఇప్పుడు వలస బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఒక వైపు చూస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. మరో వైపు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వయసురీత్యా మరెంతో కాలం యాక్టివ్ గా ఉండే పరిస్థితి. పార్టీని తన స్థాయిలో ముందుకు నడిపించగల నాయకుడి  కోసం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. తన కుమారుడు నారా లోకేష్ ఉన్నా, ఆయన పరిస్థితి ఏంటి ? పార్టీ పగ్గాలు అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయనను దూరం పెడుతూనే పార్టీలో ఉన్న సమర్థులైన నాయకులు కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. 

IHG


వయసు రీత్యా తాను ఎక్కువగా యాక్టివ్ గా ఉండలేకపోవడం,నిత్యం ప్రభుత్వంపై ధర్నాలు, ఉద్యమాలు చేయాల్సి ఉండటంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడిని మార్చాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్న నాయుడు పేరు పరిశీలనలోకి  వచ్చినా, ఆయన ప్రస్తుతం అరెస్టయ్యారు. ఇక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పేరు తెర మీదకు తెస్తున్నా, ఆయన లోకేష్ కంటే సమర్థవంతమైన నాయకుడు, లోకేష్ కంటే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న నాయకుడు  కావడంతో పూర్తిగా పార్టీ ఆయన కంట్రోల్ లోకి వెళ్లి పోతుందనే భయం చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోంది. 


పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించాలనే విషయంలో చంద్రబాబు టెన్షన్ పడుతుండగానే ఇప్పుడు పార్టీ కీలక నాయకులు అవినీతి, అక్రమాల కేసులో జైలుకు వెళుతుండటం, ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పై చులకన భావం ఏర్పడడం వంటి పరిణామాలు చంద్రబాబు ని తీవ్ర అసహనానికి గురి చేస్తున్నాయి. ముందు ముందు తెలుగుదేశం పార్టీకి రాజకీయ భవిష్యత్తు కష్టంగానే కనిపిస్తున్నా, ఎక్కడా ఆ భయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు బయటకు కనిపించకుండా గంభీరంగా ఉంటూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.


 2024 ఎన్నికల్లో అధికార పీఠం మనమే దక్కించుకుంటాము అంటూ పదే పదే పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు. కానీ పార్టీ పూర్తిగా కంట్రోల్ తప్పిందని, గత ప్రభుత్వంలో నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతోనే ఇప్పుడు ఈ విధంగా అవినీతి కేసుల్లో జైలు పాలవుతున్నారనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా తప్పదు కాబట్టి అన్యాయం జరిగిపోతోంది అంటూ గగ్గోలుపెడుతూ , నిరసనలు తెలియజేస్తూ పార్టీని నెట్టుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: