అయితే చంద్రబాబు, టీడీపీ నేతల సవాళ్లకు వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. విశాఖలో రాజధాని వద్దని టీడీపీ నిరూపించగలిగితే రాజధానిని అమరావతికే పరిమితం చేస్తామని వైసీపీ విశాఖ నేతలు సవాల్ విసురుతున్నారు. టీడీపీకి వైజాగ్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరు రాజీనామా చేసి.. రాజధాని అంశంపై మళ్లీ గెలిచినా.. వైసీపీ అమరావతికే రాజధానిని పరిమితం చేస్తుందని వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు.
తన స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. అమరావతి రైతులకు తమ ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని అవంతి శ్రీనివాస్ తెలిపారు. తక్కువ ఖర్చుతో విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయొచ్చునని అవంతి శ్రీనివాస్ అంటున్నారు. తక్కువ సమయంలోనే విశాఖ ఆదాయ వనరుగా మారనుందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని అవంతి తెలిపారు.
మరోవైపు పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ టీడీపీకి సవాల్ విసిరారు. విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. అమరావతిలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని టీడీపీ, పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. టీడీపీ హయాంలో విశాఖ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదాల్లో 53 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పుడు జరిగిన చిన్న ప్రమాదాలను కూడా రాజకీయం చేసి విశాఖపై విషం చిమ్ముతున్నారని అదీప్ రాజ్ నిప్పులు చెరిగారు.
అమరావతిలో జరిగిన అక్రమాలను అసెంబ్లీలో సాక్ష్యాలతో సహా నిరూపించామని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉన్నారా.. లేక డూప్‌తో మాట్లాడిస్తున్నారో అర్థం కావడం లేదు. నాలుగు నెలలుగా ఆయన అడ్రస్సే లేరని అదీప్ రాజ్ కామెంట్ చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి