కాలం మారుతోంది.. కాలంతో పాటు సమాజమూ మారిపోతోంది. ఇప్పుడు ఐదేళ్ల పిల్లాడి చేతికి కూడా స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. అన్నీ తెలిసిపోతున్నాయి. మరి ఈ కాలంలో వయసొచ్చాక అమ్మాయి, అబ్బాయి సెక్స్ లో పాల్గొనడం తప్పా కాదు.. పరస్పరం ఇష్టపడి శృంగారంలో పాల్గొంటే పెద్దలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదా.. ఇలాంటి అంశాలపై hari Krishna MB ఫేస్‌బుక్‌లో రాసిన ఓ ఆర్టికల్ చర్చకు దారి తీసింది. మీరూ చదవండి.  


Hari krishna MB... కొంచెం సెన్సిటివ్ టాపిక్.. ఇంకొంచెం వయసొచ్చాక రాద్దామని అనుకున్నా కానీ నిన్న రాత్రి ఒకరు రాసింది చదివి, ఇప్పుడే రాసాను. warning: కొంచెం పెద్ద ఆర్టికల్…

    “అమ్మాయిలూ, పెళ్లి కాకముందే అబ్బాయితో పడక పంచుకోకండి. మిమ్మల్ని హోటల్ కి తీసుకెళ్లే వాడితో, మీ దగ్గరికి కండోమ్స్ తెచ్చుకునే వాడిని నమ్మకండి, ఎప్పటికైనా ప్రమాదమే. మీ శరీరాన్ని చూడాలనుకునే వాడు కామాంధుడు. లైంగిక కోరిక తీర్చుకోవాలని చూసేవాడిని మీ దగ్గరికి రానివ్వకండి. మిమ్మల్ని ప్రేమించిన అబ్బాయి మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టడు. స్త్రీని గౌరవించడం మన సంప్రదాయం అలాంటి వాడిని భర్తగా పొందండి” – ఇది దాని సారాంశం. ఎవరో స్వప్నిక అనే ఆమె ఇంగ్లీష్ రాసినదాన్ని ఇంకొకరు తెలుగులో అనువదించారు…



నాకు దీనిపట్ల కొంత వ్యతిరేకమైన అభిప్రాయం ఉంది.. అందుకే ఈ నాలుగు ముక్కలూ..

కాలం చాలా మారిపోయింది. మనం ఆపితే చాలా మటుకు ఇప్పుడు ఆగే పరిస్థితి లేదు.. చిన్నప్పుడు మేము దాదాపు 42 డిగ్రీల ఎండలో పొద్దున ఆరు నుంచి రాత్రి ఆరు వరకు గ్రౌండ్ లో క్రికెట్ ఆడే వాళ్ళం.. తినడానికి కూడా ఒక్కోసారి ఇంటికివెళ్ళేవాళ్ళం కాదు. అమ్మ నాన్న ఎంత చెప్పినా కూడా ఎలాగైనా వెళ్ళేవాళ్ళం. ఆ వయసులో ఆ “మోజు” అలాంటిది. ఇప్పటి పిల్లలు బయట అలాంటి ఆటలు ఆడకపోయినా phone లో/ ఐ పాడ్ లో ఆడుకుంటున్నారు. ఇప్పుడూ తల్లిదండ్రులు వద్దూ వద్దూ అని చెప్తున్నారు.. అయినా వారు ఆగట్లేదు.. “మోజు” అలాంటిది.. ఒకవేళ అలాంటి ఐప్యాడ్ గాని ఫోన్ గాని అందుబాటులో లేకపోతే పక్కింటికి లేదా, ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి అయినా ఆడుకుంటారు కానీ, ఆగరు..

సరిగ్గా గా సుఖాల విషయంలోనూ ఇప్పుడున్న సమాజంలో ఇంతే… ఏ “మోజు” నైనా ఎక్కువ రోజులు ఆపలేము. కొన్ని subjects తెలియాలంటే ఒకప్పుడు చాలా age అవసరమయ్యేది.. ఇప్పుడు ఆరేళ్ల పిల్లాడికి మొబైల్ ఫోన్ ఆపరేట్ చెయ్యడం వస్తుంది. phone అంటూ చేతిలో ఉన్నాక ఇక censor ఉండదు. అరవీరభయంకరమైన జ్ఞానం అంతా దాంట్లోనే ఉంది..

కొందరు తెలిసీ, కొందరు తెలియకా చాలా subjects పట్ల జ్ఞానం పెంచేసుకుంటున్నారు. ఒకప్పుడు పోర్న్ చూడాలంటే ఇంటర్నెట్ సెంటర్ దగ్గరికి వెళ్లి దొంగతనంగా చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రతి మొబైల్ ఫోన్ porn వాహకమే.. ఎంతోమంది తల్లిదండ్రులకు మొబైల్ లో Options అర్థం కావు.. ఇక child lock లు పెట్టినట్లే.. అడ్డు అదుపులేని exposure మన పిల్లల కళ్ళముందే ఉన్నప్పుడు సహజంగానే రొమాన్స్ – సెక్స్ – ఆపోజిట్ జండర్ పట్ల ఆసక్తి పెరిగిపోతుంది. ఆసక్తి అంటూ పెరిగాక, వాటిని రీచ్ అవ్వకుండా మనం ఎన్ని రోజులు ఆపగలం.

నేను డిగ్రీ చదివే రోజుల్లోనే ఒక కాలేజీ ఫంక్షన్ లో ఒక పెద్దాయన వచ్చి “మీరు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ మీ మీ పర్స్ ల లో ఏమున్నా లేకపోయినా కండోమ్ మాత్రం పెట్టుకుని ఉండండి… మీకు చాలా అవసరం” అని చెప్పాడు. ఆనాడు నాకు అది అర్థం కాలేదు, కానీ ఇప్పుడు school దశ లో నే ఇలాంటి వాటి పట్ల పిల్లలకు educate చెయ్యాల్సిన అవసరం ఉంది.

పిల్లలకు చెప్పాల్సింది అది చెయ్యకండి ఇది చెయ్యకండి అని కాదు.. ఒకవేళ చెయ్యాల్సిన పరిస్థితి వస్తే safe గా ఎలా చెయ్యాలా అని.. జాగ్రత్తలు ఎలా పాటించాలి అని. లేని పోని రోగాలు , అనవసర ప్రెగెన్సీ లు రాకుండా ఎలా తమను తాము కాపాడుకోవాలి అని. వాళ్ల ఆసక్తులు తీర్చుకునే వెసులుబాటు మనమే కల్పిస్తే జరిగే మేలు కంటే, అన్ని దార్లూ మూసేస్తే వచ్చే నష్టమే ఎక్కువ. లేకుంటే మనం కళ్ళు మూసుకుని పాలు తాగిన పిల్లి లా ఉండిపోతాం.

కాలం చాలా మారింది. పైన ఆమె చెప్పినట్టు అదేదో కోరిక కేవలం అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది, అమ్మాయిలకు ఆ విషయం పట్ల ఆసక్తి ఉండదు అన్నట్టు చెప్పడం కూడా half truth. Hormones ప్రభావం, మీడియా ప్రభావం అబ్బాయిలు అమ్మాయిల మీద ఒకే రకం గా ఉంటుంది.. Expression లో తేడాలు ఉండొచ్చు. మన పిల్లలకు నేర్పాల్సింది అవతలి మనిషి పట్ల మర్యాద. అవతలి మనిషి యొక్క నిర్ణయం పట్ల మర్యాద, అవతలి వ్యక్తి యొక్క ఇష్టం పట్ల మర్యాద..

ఒకసారి ఈ మర్యాద అనేది అలవాటు అయితే, ఇక ఒకరు ఇంకొకరిని force చెయ్యరు. మన dna లో sync అయిపోవాలి. “ఒక వ్యక్తి ఇష్టం లేకుండా ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళకూడదు” అనేది. ముందు మనమే పాటించాలి కూడా. పిల్లలకు ఏదైనా ఇష్టం లేదు అని చెప్తే మనం ఎన్ని సార్లు వింటాం. తమకు ఫలానా తిండి ఇష్టం లేదంటే వినము. ఫలానా clothes నచ్చలేదు అంటే వినము. చాలా మటుకు force చేస్తాము. మనం వాళ్ళ ఇష్టాయిష్టాలకు ఏ మాత్రం ఇవ్వకుండా వాళ్ళు మాత్రం విలువలు, మర్యాద నేర్చుకోవాలి అనుకోవడం మూర్ఖత్వం..



What’s your number అనే ఇంగ్లీష్ మూవీ భలే ఉంటుంది. అందులో ప్రధాన పాత్రల మధ్య లో ఉండే సంభాషణలు ప్రతి ఒక్కరూ వినాలి. “నువ్వు నాకు పరిచయం లేక ముందు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటే నాకేం సంబంధం” అంటాడు ప్రధాన పాత్రధారి కథానాయిక తో. ఆ ఒక్క సంభాషణ చాలు ఆ పాత్రల మానసిక స్థాయి అర్థం చేసుకోవడానికి. అంటే ఇక్కడ అ వాళ్ళ మధ్యలో ఉన్న ఆకర్షణ గాని ప్రేమ గాని ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు brains మధ్య. రెండు జననాంగాల మధ్య కాదు.

మన దగ్గర అవసరానికంటే చాలా ఎక్కువ ఫోకస్, మర్యాద జననాంగాలకు ఇస్తున్నాం. అమ్మాయిల వర్జినిటీ ని ఒక పెద్ద ఆస్తి గా పరిగణిస్తున్నాం.. దాన్ని ఎవరైనా సొంతం చేసుకుంటే ఒక పెద్ద రాజ్యాన్ని కోల్పోయిన రాజు లాగా బాధపడుతున్నాము.. ఇప్పుడు 20s లో ఉన్నవారి ఆలోచనలు ఇలా లేవు… పెద్దలు కూడా ఎంత త్వరగా మారితే ఆంత మేలు. రానున్న 20-30 ఏళ్ళ లో మనం చాలా మార్పులు చూడబోతున్నాం. వచ్చే జనరేషన్ కి మనం చెప్పాల్సింది సేఫ్ సెక్స్ ఎలా possible అని… అంతకన్నా వేరేది చెప్పినా పెద్ద గా workout అవ్వదు.

మీ శరీరాన్ని కోరుకునే వాడు ప్రతి ఒక్కడు దుర్మార్గుడు అని చిత్రీకరించడం కూడా చాలా తప్పు. కేవలం అబ్బాయిలే శరీరాన్ని కోరుకోరు. అమ్మాయిలు కూడా కోరుకుంటారు.. మన సమాజంలో ఉన్న కట్టుబాట్ల మధ్య దాన్ని వ్యక్తపరిచే లేకపోవచ్చు అంతమాత్రాన అమ్మాయిలకు కోరికలు ఉండవని కాదు ఆ కోరికలు తీర్చుకోవడానికి కాదు.. ఇక్కడ కూడా పిల్లలకు చెప్పాల్సింది మ్యూచువల్ రెస్పెక్ట్..



పైన ఇంకో చెప్పే విషయం ఏంటంటే పెళ్లికి ముందు అబ్బాయితో పడుకోవద్దు ఇది కూడా పాతకాలం నాటి మాట. ఈ కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు పట్టించుకోవట్లేదు అసలు.. మనం చాలా మంది Ki & Ka సినిమా చూసి ఉంటాం.. అమ్మాయి తల్లి ఆ అమ్మాయి ని అడుగుతుంది, “నీ బాయ్ ఫ్రెండ్ పడక మీద పర్లేదా” అని. ఇది ఎంత మాత్రం సిగ్గుపడాల్సిన విషయం కాదు ఇప్పుడు. Urban india కీ, మిగతా ఇండియా కీ ఈ విషయం లో చాలా అసమానతలు ఉన్నట్లున్నాయి.

అబ్బాయి ఎంత పొడవు ఉన్నాడు, జీతం ఎంత వస్తుంది., ఆస్తులు ఎన్ని ఉన్నాయి, కులం, మతం. ఇవన్నీ చూస్తున్నారు. వీటి అన్నిటి కంటే కూడా ఆ అబ్బాయి పడకమీద ఎలా ఉన్నాడు అనేది కూడా అమ్మాయికి ముఖ్యమే.. అమ్మాయి ఎలా ఉంది అనేది అబ్బాయి కూడా ముఖ్యమే.. ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మన దేశంలో 90 శాతం పెళ్లిళ్లు జరిగిపోతాయి.. అందులో ఎంత శాతం ఉంది ఆనందంగా ఉన్నారో తెలియదు గానీ… Compatibility అనేది చాలా ముఖ్యం. మతం, కులం, ఉపకులం, ఆర్ధిక స్థాయి etc వాటి లో compatability చూసాం అనుకుంటున్నారు చాలా మంది.. కానీ ఈ విషయం లో compatability లేక విడిపోలేక, కలిసి ఉండలేక , ఎంతమంది కపుల్స్ బతుకులు ఈడుస్తున్నారో..



మా తాత అంటాడు అసలు 50 ఏళ్లకు ముందు ప్రేమ ఎలా పుడుతుంది అని.. ఇంకొక రచయిత అంటాడు అసలు 20 ఏళ్ల పిల్లల మధ్య ప్రేమ ఎలా ఉంటుంది అని. కొత్తగా పరిచయం అయిన వాళ్ళ మధ్య, కొత్తగా పెళ్లైన వాళ్ళ మధ్య ఉండాల్సింది ఆకర్షణ అంటాడు.. ఆ ఆకర్షణ ను ఇద్దరు ఎంత కాలం కాపాడుకున్నారు, ఎంత బాగా కాపాడుకున్నారు అనేదాన్ని బట్టి వాళ్ల మధ్య అనురాగం కానీ బంధం కానీ నడుస్తుంది, అదే ఆకర్షణ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏళ్లు గడిచేకొద్ది ప్రేమగా మారుతుంది. ఈ ఆకర్షణ లేని చోట్ల సంసారాలు బాధ్యతల మీద నడుస్తూ ఉంటాయి అంటాడు.



స్త్రీని గౌరవించడం మన సంప్రదాయం అని చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కానీ ఎంత మంది స్త్రీలను గౌరవిస్తున్నారు చూస్తూనే ఉన్నాం.. ఎంతమంది తల్లులను తమ తండ్రుల గౌరవిస్తున్నారు అనేది పిల్లలు చూస్తూనే ఉన్నారు. పిల్లలకు చెప్పడం కన్నా ఏదైనా ఆచరించి చూపితే చాలా మేలు. తండ్రి తల్లి ఇద్దరూ ఇంట్లో గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే, ఆ ఇంట్లో పెరిగిన పిల్లలు కూడా చాలా వరకు ఇతరులకు మర్యాద ఇస్తారు.

మనం మర్యాద ఇవ్వాల్సింది అవతలి వ్యక్తికి. అది స్త్రీయా పురుషుడా అన్నది కాదు. ఒక మనిషిని మనిషిగా మనం గుర్తించి గౌరవించిన రోజున అవతలివాళ్ళ జెండర్, కులం, మతం, ఆర్థిక స్థాయి ఇవన్నీ మనం పట్టించుకోము..

మనలో ఎంతమంది బయట రెస్టారెంట్లో waiters కి రెస్పెక్ట్ ఇస్తాం. మనలో ఎంతమంది చెప్పులు కుట్టే వాడి దగ్గరికి వెళ్లి “మీరు” అని మాట్లాడతాం. మనలో ఎంతమంది రోడ్లు ఊడ్చే వాళ్ళతో మర్యాదగా మాట్లాడతాము. ఈ మర్యాద ఇవ్వడం అనేది మనం డీఎన్ఏలో భాగమైన రోజున మనకి సంప్రదాయాలు అవసరం లేదు.



ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయి కోసం చాలా ఇవ్వగలడు. చాలా వస్తువులు కొనివ్వగలడు. బైక్ లో నో కార్ లో నో షికారు కి తీసుకెళ్లగలడు. అమ్మాయిలు అందరూ ఇవి చెయ్యలేరు. అబ్బాయి అమ్మాయి శరీరం కోసమే ఇవన్నీ చేసే అవకాశం కూడా ఉంది. అమ్మాయి తిరిగి ఏమిచ్చినా వాడికి ఆనందం ఉండదు. అందుకే అమ్మాయిలు కూడా తమకు నచ్చిన వాడి కోసం తన శరీరాన్నే ఇస్తుంది. వాడికి నచ్చింది ఇచ్చి వాణ్ని సొంతం అనుకుంటుంది. ఐడెమ్అం తప్పు కాదు. ఆ అవకాశాన్ని అబ్బాయి misuse చెయ్యడం, exploit చెయ్యడం తప్పు. Exploit ఎవరు చేసిన తప్పే. కానీ చాలామంది అబ్బాయిలు ఒకసారి అమ్మాయి ఇలా చేయగానే వాళ్ల క్యారెక్టర్ని జడ్జి చేసేస్తున్నారు. ఇది చాలా దారుణం.. మిగతా వాళ్ళు కూడా జడ్జ్ చేస్తున్నారు. కేవలం ఒక అమ్మాయి రెస్పెక్ట్ ఆ అమ్మాయి virginity మీదే ఉండడం దారుణం. ఇది మారాలి. మారుతుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకో 20 ఏళ్ళ లో అయినా ఇప్పుడు ఇరవై ల్లో ఉన్న వాళ్ల ఆలోచనలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి..



Mauritius ఒక హిందూ దేశం అక్కడ ఒక అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడితే, ఖచ్చితంగా కొన్ని నెలలు వాళ్ళు కలిసి తిరగలి. నచ్చిన వెంటనే పెళ్లి చేసుకోవడానికి లేదు. ఇద్దరి ఇళ్లకూ వెళ్లొచ్చు, బయట తిరగొచ్చు. అలా కొన్ని నెలలు తిరిగి, అప్పటికీ వారికి ఇష్టం ఉంటే అప్పుడు పెద్దలే పెళ్లి చేస్తారు. మధ్యలో నచ్చకపోతే ఎవరి దారి వారిది. మళ్ళీ ఎదురైనా పాత బాకీలు ఏమీ ఉండవు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈ ప్రాసెస్ నుంచి వచ్చిన వాళ్లే కాబట్టి వాళ్ల మీద జడ్జిమెంట్ ఉండదు.. ఇంత organised గా జరక్కపోయినా చాలా దేశాల్లో ఇదే పద్ధతి..ఎవరి పార్టనర్స్ ని వాళ్ళే select చేసుకుంటారు… కష్టం అయినా సుఖం అయినా వాళ్లదే choice ..



చాలా మందికి పెద్ద అపోహ బయట దేశాల్లో భార్యాభర్తల సంబంధాలు బాగుండవు. Infidelity ఎక్కువ, విపరీతమైన వివాహేతర సంబంధాలు ఉంటాయి, పోలీగామి ఉంటుంది, వ్యక్తుల మధ్య సంబంధాలు సరిగా ఉండదు అని. నేను చాలా దేశాలు తిరిగాను చాలా దేశాల్లో చూశాను మన దగ్గర వివాహవ్యవస్థ ఎంత గట్టిగా ఉందో వాళ్ల దగ్గర కూడా అంతే గట్టిగా ఉంది. ఒకరి కులం, మతం, ఆర్థిక స్థాయి, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇవేమీ తెలియకుండా నే ఒకరినొకరు ఇష్టపడతారు… వాళ్ళ జీవితాల్లో పేరెంట్స్ ప్రభావం, ఆస్తుల ప్రభావం కూడా చాలా తక్కువ. సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ.. మెజారిటీ మనుషులు ఒకే పార్టనర్తో జీవితం గడిపేస్తారు.. ఒకరి కన్నా ఎక్కువ సహచరులు ఉండడం నార్మల్ కాదు.. ఒకసారి పెళ్లి అయ్యాక adultery అక్కడ కూడా ఒప్పుకోరు. One partner at a time వర్క్ అవుతుంది మెజారిటీ…



ఒక మహిళ గాని ఒక పురుషుడు గానీ అవతలి వాళ్ళ శరీరాన్ని ఆరాధించడం దుర్మార్గం కాదు. అవతలి వాళ్ళ ఇష్టం లేకుండా ప్రవర్తించడం దుర్మార్గం. ఈ difference పిల్లలకు చిన్నప్పటి నుంచే చెప్పడం, మనం పాటించడం చేస్తే మేలు.



ఈ సంప్రదాయం అనే పదం పట్ల దాని వెనకాల ఉన్న కుల, మత, వర్గ ఆలోచనల పట్ల నాకు పూర్తిగా వైవిధ్యమైన భావం ఉంది..

ఇది రాసినందుకు నన్ను కూడా జడ్జి చేయొచ్చు. చేసినా పర్లేదు. దీని గురించి చాలామంది చాలా రకాలుగా ముందే రాశారు. నిన్న రాత్రి అది చదివాక ఈ నాలుగు ముక్కలూ రాయకుండా ఉండలేకపోయాను. ఫేస్బుక్లో రాసినంత మాత్రాన బయట ప్రపంచం మారిపోతుంది అని నేనేమీ అనుకోను కానీ, మిత్రులు కొంతమందైనా తమ ఆలోచన సరళిని assess చేసుకుంటారని ఆశిస్తున్నాను.. ఏం రాసినా quarantine లో ఉన్నంతవరకే… అయ్యాక work busy లో కుదరదు…

రచయిత - Hari krishna MB ‍(facebook ) 

మరింత సమాచారం తెలుసుకోండి: