పెగాసస్‌ స్కామ్.. ఇప్పడు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం ఇది. కొందరిని ప్రభుత్వం టార్గెట్‌ చేసుకుని వారి ఫోన్ల హ్యాక్ చేయడం ఈ స్కామ్ లోని ప్రధాన అభియోగం.. ఇది ప్రపంచమంతా జరుగుతోందని అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. ఇజ్రాయెల్ దేశంలోని ఓ సంస్థ రూపొందించిన ఈ స్పై సాఫ్ట్ వేర్‌ను అనేక దేశాలు కొనుక్కుని తమ అవసరాల కోసం వాడుతున్నాయని తెలుస్తోంది. అయితే.. ఇండియా విషయానికి వస్తే.. అనేక మంది రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తల ఫోన్లు పెగాసస్ ద్వారా హ్యాక్ అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి.


రాహుల్ గాంధీ వంటి వారితోపాటు ప్రశాంత్ కిషోర్‌ ఫోన్లు.. కొందరు కేంద్ర మంత్రుల ఫోన్లు హ్యాక్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయ్యాయట. అయితే ఎవరి ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న విషయాలు వెలుగులోకి రాలేదు కానీ.. హ్యాక్ అయ్యింది మాత్రం వాస్తవం అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటున్నారు. ఆయన తన సంపాదకీయంలో ఈ విషయం ప్రస్తావించారు. అంతే కాదు.. ఈ ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని ఏకంగా ఓ ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద అన్నట్టు ఆంధ్రజ్యోతి పత్రికాధిపతి రాధాకృష్ణ రాసుకొచ్చారు.


ఆయన ఏం రాశారంటే.. మీరు పంపే మెసేజ్‌లు, మీకు వచ్చే మెసేజ్‌లను నేను ఎప్పటికప్పుడు చదవగలనని ఓ సీఎం అన్నాడట.. ఈ విషయాన్ని తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరితో అన్నారట. ఆ భయంతోనే ఇప్పుడు చాలా మంది ప్రముఖులు ఐఫోన్‌ కొనుక్కుంటున్నారట. ఐ ఫోన్‌కు హ్యాక్ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు.. ఐఫోన్‌ లోని ఫేస్‌ టైమ్‌లో మాట్లాడుకుంటున్నారట. చాలా మంది అలా మాట్లాడుకుంటున్నా.. ఇది ఎంతవరకు సురక్షితమో తెలియదట.  


ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బయటపెట్టిన ఈ విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లో చర్చకు దారి తీసింది. ఆ సీఎం ఎవరు.. ఎవరి వద్ద అన్నారు.. ఎవరి ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి.. అన్నది ఇప్పడు తేలాల్సిన అంశం. కానీ.. తేలుతుందా..?


మరింత సమాచారం తెలుసుకోండి: