2004 నుంచి రాజకీయాల్లో ఉన్న కోలగట్ల.. వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అప్పటి ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. తర్వాత.. అప్పటి వైఎస్ ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణతో ఏర్పడిన వివాదాలు, విభేదాల కారణంగా.. ఆయన గ్రూపు రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇక, 2009లో కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకు న్నా.. విజయం దక్కించుకోలేక పోయారు.
2014లో వైసీపీ తరపున పోటీ చేసినప్పటికీ.. పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లోనే ఆయన వైసీపీ సునామీ కలిసి వచ్చి.. గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఆయన మంత్రి పదవిపై మోజు పెట్టుకున్నారు. గత ఎన్నికల అనంతరం.. మంత్రి పదవి ఖచ్చి తంగా వస్తుందని ఆశించారు. అంతేకాదు.. పార్టీకి భారీ రేంజ్‌లో విరాళం ఇచ్చింది తాను ఒక్కడినేని.. పదే పదే చెబుతుంటారు కూడా. ఎన్ని చెప్పినా.. ఎన్ని చేసినా.. గతంలో మాత్రం ఆయనకు మంత్రి పదవి ద క్కలేదు.
దీంతో ఇప్పుడు ఏర్పడబోయే కొత్త మంత్రివర్గంలో అయినా చోటు దక్కుతుందేమోనని ప్రయ త్నిస్తున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అంతేకాదు.. పార్టీ తరఫున గట్టి వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఈ క్రమంలో నే ఇక, తను వచ్చే ఎన్నికల్లో పోటీచేసేది లేదని.. చెబుతున్నారు. తద్వారా అయినా.. జగన్ కరుణించి తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరి ఇప్పుడైనా.. ఆయన ఆశలు నెరవేరుతాయా? చూడాలి ఏం జరుగుతుందో!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి