ప్రభుత్వం పరంగా ఏం చేయాలో.. అదే చేస్తున్నారు. కొన్నివిషయాలను వెంటనే స్పందించకపోతే.. ఇ బ్బందులు మనకే వస్తాయని కూడా ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాల సమస్యరాష్ట్రాన్ని కుదిపే స్తోంది. సొంత పార్టీ నేతలే.. జిల్లాల విభజనను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ వార్తలు, విషయాలు.. అభ్యర్థనలు కూడా జగన్ వరకు చేరుకున్నాయి. అయితే.. వీటికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (గ్రామీణ శాఖమంత్రి కాబట్టి)కి బాధ్యతలు అప్పగించారు జగన్.
జిల్లాల సమస్యలపై ఎక్కడ ఎలాంటి వివాదాలు వచ్చినా.. వెంటనే స్పందించాలని.. ఆయన మంత్రికి సూచించారు. అయితే.. ఆయన మాత్రం ఇతరత్రా విషయాల్లో మునిగిపోయారు. అంతేకాదు.. ఇప్పుడు మన పార్టీ నేతలపైనే మనం స్పందిస్తే.. ఎలాంటి వ్యతిరేకత పెరుగుతుందో.. అని మంత్రి సైలెంట్ అయ్యారు. దీనిపైనే జగన్ ఆయనకు క్లాస్‌తీసుకున్నారట. `` ఏం జరుగుతుంది. వెంటనే స్పందించండి. అలా చేయకపోవడం వల్లే.. మనకు మేలు కన్నా.. డ్యామేజీ ఎక్కువగా ఉంటుంది. వెంటనే రియాక్ట్ అయి.. సమస్యను పరిష్కరించండి`` అనని జగన్ తేల్చి చెప్పారట.
మామూలుగా జగన్ దగ్గర మిగిలిన మంత్రుల పలుకుబడి వేరు.. పెద్దిరెడ్డి పలుకుబడి వేరు. పెద్దిరెడ్డి కి జగన్ ఎలాంటి ప్రయార్టీ ఇస్తారో చెప్పక్కర్లేదు. అలాంటి పెద్దిరెడ్డికి జగన్ కాస్త సుతిమెత్తిని హెచ్చిరిక తోనే ఈ విషయం చెప్పేసరికి ఆయన కూడా కాస్త ఉలిక్కి పడ్డాడట. దీంతో ఆయన రేపో మాపో.. ఆయన రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి