తాజాగా కొత్తపల్లి కొత్త పల్లవి అందుకున్నారు. భీమవరంను కాకుండా నర్సాపురంనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళన చేస్తోన్న క్రమంలో ఆయన వైసీపీలో ఉండి ఆయన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. అంతే కాకుండా గత ఎన్నికల్లో నరసాపురం ఎమ్మెల్యే గా ముదునూరు ప్రసాదరాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో బహిరంగ సభలో కొట్టుకుని పెద్ద సంచలనానికి తెరదీశారు. ఇదే ఆయన పార్టీ మారేందుకు సంకేతం అంటున్నారు.
ఇక ఆయన ఏ పార్టీలోకి వెళతారు ? అన్నది పక్కన పెట్టేస్తే ఆయన మాత్రం త్వరలోనే పార్టీ మారేందుకు సంకేతం అని జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. సుబ్బారాయుడు గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి అయ్యారు. నరసాపురం ఎంపీగా కూడా గెలిచారు. అలాంటిది ఆయన పలు పార్టీలు మారడంతో నరసాపురంలో ఆయన చరిత్ర అంతా గతం అయిపోయింది. అసలు ఆయన్ను ఏ పార్టీ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ పార్టీలోకి కూడా ఆయన్ను రానిచ్చే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఆయన అన్ని పార్టీలు తిరిగేసి ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు జనసేన ఒక్కటే ఆప్షన్ గా ఉంది. ఆ పార్టీలోకే ఆయన వెళ్లలేదు. దీంతో ఇప్పుడు చాలా మంది కొత్తపల్లి జనసేన వైపు చూస్తున్నారని కొందరు చెబుతున్నారు. జనసేన, టీడీపీ పొత్తులో తాను ఎమ్మెల్యే అవుతానని ఆయన ఆశలతో ఉన్నారు. అలాగే మంత్రి కూడా అయిపోతానని అనుకుంటున్నారట. మరి కొత్తపల్లి ఆశలు ఎలా నెరవేరతాయో ? చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి