ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయనే సంగతి తెలిసిందే...ఈ ప్రాంతాల్లో రాజకీయం ఎప్పుడు వైసీపీకి అనుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది...వైసీపీ రాక ముందు వరకు ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ హవా ఉండేది..తర్వాత వైసీపీ హవా మొదలైంది..గత రెండు ఎన్నికల్లోనూ ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ సత్తా చాటుతూనే ఉంది..అయితే ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది...అధికారంలోకి వచ్చిన సరే వైసీపీ ఎమ్మెల్యేలు...ఏజెన్సీ ప్రాంతాల్లో చేసే అభివృద్ధి శూన్యం.

ఈ మూడేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుకు మంచి మార్కులు ఏమి పడటం లేదు...అలా అని ఏజెన్సీ స్థానాల్లో వైసీపీ వీక్ అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు...ఎందుకంటే ఇక్కడ ప్రజలు...జగన్ పట్ల పాజిటివ్ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు...ఎమ్మెల్యేల పట్ల పెద్దగా పాజిటివ్ గా లేకపోయినా సరే...జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి...పథకాలే ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉండటానికి కారణమని చెప్పొచ్చు.

అలాగే ఇక్కడ టీడీపీ పెద్దగా పుంజుకోకపోవడం కూడా వైసీపీకి అడ్వాంటేజ్ గా ఉంది. రంపచోడవరం, పాడేరు, అరకు, పాలకొండ, కురుపాం, సాలూరు లాంటి స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలపై నెగిటివ్ ఉన్నా సరే టీడీపీకి పాజిటివ్ లేకపోవడం గమనార్హం. ఈ స్థానాల్లో టీడీపీ నేతలు పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. ఏదో ఒకటి, రెండు స్థానాల్లో నాయకులు బాగా పనిచేస్తున్నారు గాని, మిగిలిన స్థానాల్లో మొక్కుబడిగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు..ఎన్నికల వచ్చాక చూసుకుందాం అన్నట్లే ఉన్నారు.

ఇలా ఉండటం వల్లే ఏజెన్సీ స్థానాల్లో టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ దొరకడం లేదు..ఇక జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల టీడీపీ వైపుకు ప్రజలు రావడం లేదు. ఎన్నికలనాటికి ఇదే పరిస్తితి కంటిన్యూ  అయితే..మళ్ళీ ఏజెన్సీ స్థానాల్లో టీడీపీ గెలవడం సాధ్యమయ్యే పని కాదు...ఇకనుంచైనా టీడీపీ నేతలు ఇంకా దూకుడుగా పనిచేస్తేనే ఏజెన్సీల్లో సైకిల్ కు పంక్చర్లు పడకుండా ఉంటాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: