టీడీపీ ఎమ్మెల్యే (రాజీనామా చేసినా.. ఇంకా స్పీక‌ర్ అనుమ‌తించ‌లేదు)గంటా శ్రీనివాస‌రావు వ్యూహం ఏంటి? ఆయ‌న అడుగులు ఎటువైపు ప‌డుతున్నాయి?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఏ పార్టీత‌ర‌ఫున పోటీ చేస్తారు?  వం టి కీల‌క అంశాల‌పై రాజ‌కీయ నేత‌లు చ‌ర్చోప‌చ‌ర్చ‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతంటీడీపీలో ఉన్నా.. ఆయ‌న యా  క్టివ్‌గా లేని విష‌యం తెలిసిందే. పైగా.. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కార్మికుల నిర‌స‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా.. త‌న ఎమ్మె ల్యే ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌న‌సేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంకీర్ణ ప్ర‌భుత్వం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. గంటా అంచ‌నా వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్ల‌డం ద్వారా.. మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి వైసీపీ నుంచి ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ.. మంత్రి ప‌ద‌విపై.. ఆయ‌న‌కు క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో.. దూరంగా ఉన్నార‌ని.. కొన్నాళ్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు.. టీడీపీలోనూ.. ఆయ‌న యాక్టివ్‌గా ఉండ‌డం లేదు.

ఇప్పుడు టీడీపీలో యాక్టివ్ అయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. టీడీపీ పుంజుకుని అధికారంలోకి వ‌చ్చినా.. గంటాకు మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం మాత్రం లేదు. ఎందుకంటే.. టీడీపీలో ఇప్ప‌టికే దూకుడుగా ఉన్న కాపు సామాజిక వ‌ర్గం నేత‌లు చాలా మంది ఉన్నారు. వీరిని కాద‌ని.. చంద్ర‌బాబు గంటాకు ఛాన్స్ ఇచ్చి స్వ‌యంగా చేతులు కాల్చుకునే ప‌నిచేయ‌బోరు. పార్టీ ఎన్నో క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు గంటా ఇంట్లో దూరి బ‌య‌ట‌కు రాలేదన్న విమ‌ర్శ‌లు వ‌చ్చేశాయి.

ఇలాంటి టైంలో కూడా పార్టీని ప‌ట్టించుకోని గంటా ను ఇప్పుడు అంద‌లం ఎక్కించాల‌ని చంద్ర‌బాబు అనుకోవ‌డం లేదు. అంటే.. ఇప్పుడు టీడీపీలో ఉన్నా.. యాక్టివ్ అయినా.. గంటాకు ఫ్యూచ‌ర్‌లో మంత్రి ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం మాత్రం క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న జ‌న‌సేన‌వైపు చూస్తున్నార‌ని.. విశాఖ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌న‌సేన‌లోకి వెళ్ల‌డం ద్వారా.. ప‌ట్టుబ‌ట్టి ఆయ‌న‌ప‌వ‌న్ సిఫార్సుతో అయినా.. మంత్రి అయ్యే అవ‌కాశం వ‌స్తుంద‌ని అందుకే ఆయ‌న చూపు ఇప్పుడు.. గ్లాస్ వైపు ఉంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: