ఇవాళ అక్కడ జరగుతున్న ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ ఆ ఎన్నిక ఏంటనుకుంటున్నారా.. అదో ఎంపీపీ ఎన్నిక.. ఎంపీపీ ఎన్నికకే అంత బిల్డప్ ఏంటి అనుకుంటున్నారా.. దానికి ప్రత్యేకత ఉంది. ఇవాళ గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక జరగబోతోంది. ముందు కో ఆప్షన్ ఎన్నిక జరుగుతుంది.. తర్వాత ఎంపీపీ ఎన్నిక ఆ తరువాత ఇద్దరు వైస్ ఎంపీపీ లకు ఎన్నిక జరుగుతుంది. ఇక్కడి ఎంపీపీ స్థానం బీసీ మహిళకు రిజర్వు అయ్యింది.


ఇక్కడ 18ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం నుంచి 9మంది, జనసేన నుంచి ఒక్కరు, వైసీపీ నుంచి 8మంది ఎంపీటీసీలు గెలిచారు. తమ పార్టీ నుంచి గెలిచిన షేక్ జబీన్ కు బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని టీడీపీ ఆరోపిస్తోంది. వైసీపీ నుంచి ఇద్దరు బీసీ మహిళలు సంతోష రూపవాణి, తాడిబోయిన పద్మావతి  గెలిచారు. సంతోష రూపవాణి ని ఎంపీపీ అభ్యర్థి గా నిలబెట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఎంపీపీగా పోటీ చేయాలని తాడిబోయిన పద్మావతి కూడా భావిస్తున్నారు.


ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పద్మావతి నిలబడితే ఆమెకు మద్దతు ఇవ్వాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఇక్కడే ఉంది అసలు ట్విస్టు.. తన తల్లి తాడిబోయిన పద్మావతిని ఎమ్మెల్యే ఆర్కే కిడ్నాప్ చేశారని పద్మావతి కుమారుడు యోగేంద్రనాథ్ ఆరోపిస్తున్నారు. తన తల్లి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుందని యోగేంద్రనాథ్ చెబుతున్నారు. పద్మావతిని ఎన్నికకు హాజరుకానివ్వకుండా చేస్తే కోర్టుకు పోవాలని యోగేంద్రనాథ్ ఫ్యామిలీ ఆలోచిస్తోంది. ఈ ఎన్నిక రద్దు చేయాలి అని పద్మావతి కుటుంబసభ్యులు హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది.


ఈ నేపథ్యంలో టీడీపీ తమ ఎంపీటీసీలను కాపాడుకునేందుకు క్యాంప్ నిర్వహించింది. తమ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో క్యాంప్ పెట్టింది. ఇప్పుడు అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో దుగ్గిరాల వెళ్తున్నారు. టీడీపీ ఎంపీటీసీలకు జనసేన అభ్యర్థి సాయి చైతన్య మద్దతు తెలిపారు. టీడీపీ నేతలు ముందుగానే ఎస్‌ఈసీని ఆశ్రయించడంతో వారికి పోలీసులు రక్షణ కల్పించారు. మరి ఫలితం ఎలా ఉంటుందో?


మరింత సమాచారం తెలుసుకోండి: