ఏపీ సర్కారు అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే విద్యారంగం, సంక్షేమ రంగం, పరిపాలనలో చెప్పుకోదగ్గ మార్పులు తెచ్చింది. ఇప్పుడు తాజాగా భూముల విషయంలో మరో విప్లవాత్మక చర్య తీసుకుటోంది. రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్ లతో రాష్ట్రంలో సమగ్ర భూసర్వే ప్రక్రియ నిర్వహించబోతోంది. దీనిపై ఇప్పటికే మంత్రుల కమిటీ ఏర్పాటై కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 172 డ్రోన్లు సమకూర్చుకుని సర్వే ప్రారంభించబోతున్నారు.


ఇప్పటి వరకూ 2149 గ్రామాల్లో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి చేశారు కూడా. సచివాలయంలో భూసర్వే ప్రక్రియపై సమావేశమైన మంత్రుల కమిటీ కార్యచరణపై అధికారులతో సమీక్ష నిర్వహించింది. 756 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రుల కమిటీకి అధికారులు వివరించారు. ఈ భూ సర్వే పై ప్రజల నుంచి 9283 అప్పీళ్లు అందాయి. వాటిలో 8935 పరిష్కరించారు. సమగ్ర భూసర్వే ప్రక్రియలో భాగంగా 18,487 సర్వే రాళ్ళను పాతి సరిహద్దులు నిర్ణయించారు.


ఇక రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణా ప్రాంత స్థానిక సంస్థల్లో  5548.90 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల నిర్మాణాలు, 7 లక్షల మేర ఖాళీ స్థలాలు ఉన్నట్టు ఈ సర్వే ద్వారా తెలిసింది.  13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు లేకుండా ఈ సర్వే మంచి పరిష్కారాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.


సర్వే ద్వారా అర్బన్ , రూరల్ ప్రాంతాల్లో నివాసాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయభూములను అత్యంత శాస్త్రీయంగా సర్వే ద్వారా నిర్ధారిస్తారు. అలాగే అర్బన్ ప్రాంతంలోని ఖాళీ భూములకు సంబంధించిన సమగ్ర సమాచారంను అత్యంత శాస్త్రీయంగా సర్వే ద్వారా నిర్ధారిస్తారు. ఈ సర్వే పూర్తయితే రాష్ట్రంలో చాలా వరకూ భూ వివాదాలు సమసిపోతాయి. అలాగే ఎప్పుడో బ్రిటీష్ కాలంలో చేసిన సర్వేలు తప్పు.. ఇటీవలి కాలంలో భూములను శాస్త్రీయంగా సర్వే చేసిన దాఖలాలు లేవు. భూమి విలువ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం మెచ్చుకోదగిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: