
వీటి విషయంలో కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతూ అదంతా ఎవరి సొమ్ము కాదు మనం ఇస్తున్న సొమ్ము అంటూ మాట్లాడుతున్నారు. జగన్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులతోనే అని చెబుతున్నారు. విజయవాడలోని భవానిపురం హెచ్ బీ కాలనీలో ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ పర్యటించారు. ఆసుపత్రిని సందర్శించిన సమయంలో జగన్ ఫోటో ఉండడం అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వైసీపీ పార్టీ రంగు వేయడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధులు ఇచ్చేది కేంద్రం అయినా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫోటోలు అన్ని పెడతారు. ప్రధాని మోడీ ఫోటో ఎందుకు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య మిషన్ లోగో పెట్టరు హైకోర్టు చెప్పిన వినరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వినియోగించుకుంటూ కనీసం ఫోటో కూడా పెట్టకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ఫ్లెక్సీలు పెట్టడం ఏంటని అన్నారు. దీనిపైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంత విషయం జరిగిన ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పత్రికలు చిన్న విషయంగా రాశాయి. ఎందుకంటే భాజపా ఇస్తుందని ప్రజలకు తెలిస్తే ఇక్కడ టీడీపీ పార్టీ ఎటు కాకుండా పోతుంది. క్రెడిట్ అంతా కేంద్ర ప్రభుత్వం, బీజేపీకే పోతుందని ఆ మీడియా సంస్థలు భయపడి పూర్తి వివరాలు సైతం రాయడం లేదు.