అయితే సామాన్య ప్రజల విషయంలో జగన్ ప్రభుత్వం లెక్కలేని తనం చూపిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. విపరీతమైన కరెంట్ ఛార్జీల పెంపకం అనేద మధ్య తరగతి ప్రజలకు ఇబ్బంది పెట్టే అంశమని తెలుస్తోంది. సోలార్ విద్యుత్ వచ్చేసింది. రూ. 2, 3 రూపాయలకే యూనిట్ ఇస్తాం అని గొప్పలు చెప్పారు. కానీ ప్రస్తుతం కరెంట్ సరిపోవడం లేదు. వేరే రాష్ట్రాల నుంచి కొంటున్నాం. కాబట్టి ధరలు పెంచక తప్పడం లేదని ఉపన్యాసాలు ఇస్తున్నారు. డబుల్ రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారు.
పాలన చేతకావడం లేదని తీవ్ర వ్యతిరేకత వస్తోంది. టీచర్లు, విద్యార్థులు, డాక్టర్లు, తదితర రంగాల నిపుణుల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కూడా వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు దేశం వైపు చూస్తున్నారని తెలుస్తోంది.
2014లో టీడీపీ కంటే 1.4 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయాం వైసీపీ చెబుతోంది. అదే సమయంలో రాయలసీమలో వైసీపీకి అనుకూలంగా, కోస్తా ఆంధ్రలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. కానీ ప్రస్తుతం రాయలసీమలోనే వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు దీన్ని ఇప్పుడే గమనించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని తెలుస్తోంది. లోపాలను సరిచేసుకుని పాలన సంస్కరణలను గమనిస్తూ ప్రజల్లోకి వెళితేనే వైసీపీ గెలుపు సాధ్యమవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి