
దీని వల్ల రెవెన్యూకు సంబంధించిన ఫండ్స్ ను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వలేదు. ఇప్పుడు కేంద్రం రూ. 10,600 కోట్ల రెవెన్యూ పండ్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. 2014-2015 నాటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధులను ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట కల్పించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇలాంటి సందర్భంలో ఏ విధంగా బయటపడాలని చూస్తున్న సమయంలో కేంద్రం ఇచ్చిన ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఊరట కలిగించాయని చెప్పొచ్చు.
రూ. 10,600 కోట్లను ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటించారు. ఈ నిధుల గురించి అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో చంద్రబాబు, బీజేపీని మోదీని తీవ్రంగా విమర్శిస్తూ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు తెంచుకున్నారు.
దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా జత కట్టడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఇదే సందర్భంలో బీజేపీ దెబ్బ తీయాలని చూసి తానే అధికారం కోల్పోయారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం రెవెన్యూ లోటు నిధులను కేంద్రం అందజేయడం వెనక ఏం కారణాలు ఉన్నాయి. ఒక వేళ బీజేపీకి మద్దతు ఇస్తానని జగన్ ఏమైనా హామీ ఇచ్చారా? లేక మరేదైనా ఒప్పందం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.