ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్స్కి కి అణు విధ్వంసం అంటే అణువైనా భయం లేదని తెలుస్తుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న ఈ సందర్భంలో జెపోరిజియాలో ఉన్నటువంటి అణు విద్యుత్ కర్మాగారం టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. గతంలో  ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్నటువంటి జెపోరీజియా పై రష్యా దాడి చేసింది. దానికి సమాధానంగా ఇప్పుడు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయిన జెపోరీజియా పై ఉక్రెయిన్ దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది.


కానీ ఇక్కడ చర్చలోకి వస్తున్నటువంటి విషయం జెపోరీజియాపై దాడి గురించి కాదని, జెపోరీజియాలో ఉన్నటువంటి అణు విద్యుత్ కర్మగారం పై దాడి గురించి అని తెలుస్తుంది. అసలే అది అణు విద్యుత్ కర్మాగారం. అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ దాడుల సందర్భంలో దానికి సేఫ్టీ లేకుండా పోయిందని తెలుస్తుంది. దానికి ఉన్నటువంటి రక్షణ కవచాలలో 100కి 80 శాతం నాశనం అయిపోయినట్లుగా తెలుస్తుంది.


ఇక ఆ అణు విద్యుత్ కర్మాగారానికి కేవలం 20 శాతం మాత్రమే రక్షణ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ కర్మాగారం నీటి సరఫరా సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. అది మాత్రమే కాకుండా ఆ కర్మాగారం అనేక సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తుంది. అలాంటి భయానక పరిస్థితుల్లో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దాడులలో ఏ మిసైల్ అయినా, ఏ ఒక్క బాంబు అయినా ఈ కర్మాగారం మీద కనుక పడిందంటే అక్కడ అణు విస్ఫోటనం ఖాయం అని తెలుస్తుంది.


అదే జరిగితే దానికి చుట్టుపక్కల 1000 కిలోమీటర్ల వరకు బూడిద కూడా మిగలదని తెలుస్తుంది. గతంలో మనకు తెలిసిన చెర్నోబిల్ అణు విధ్వంసం ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగిందట. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో  జపాన్ లోని హిరోషిమా నాగసాకి పై జరిగిన అణు బాంబు దాడి లో ఎంత విధ్వంసం జరిగిందో మనం చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. మరి ఇప్పటికైనా జెలెన్స్కి జాగ్రత్త పడాలి కదా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: