ఒకప్పుడు దేశంలో వ్యవసాయం ప్రధానంగా ఉండేది. వారసత్వంగా కూడా తమ పిల్లలు వ్యవసాయం చేసేవారు. కానీ రైతుల పిల్లలు ఇప్పుడు వ్యవసాయం చేయడం లేదు. వారికి చదువులు చెప్పించి వారిని ఉన్నత విద్య వైపు తీసుకెళుతున్నారు. మంచి ఉద్యోగాలు సాధించేలా రైతు తల్లిదండ్రులు పని చేస్తున్నారు.


దీంతో రైతులు తమకు తోచినంత మాత్రమే వ్యవసాయం చేస్తూ వచ్చిన దిగుబడిని కూడా సరిగా అమ్ముకోలేక నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి కష్టం తమ పిల్లలు పడకూడదని వారిని బాగా చదివించి ఉన్నత ఉద్యోగాల వైపు వెళ్లేలా కృషి చేస్తున్నారు. అయితే వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.  భూమి ఉండి పంట పండించలేని రైతు దగ్గర నుంచి భూమిని లీజుకు తీసుకుని కార్పొరేట్ సంస్థలు పంటలు పండిస్తారు.


కూలీలకు పని దొరుకుతుంది. టెక్నికల్ వర్క్ చేస్తారు. ఎగుమతులు సాధిస్తారు. దేశం నుంచి వివిధ దేశాలకు కూడా ఉత్పత్తి చేయవచ్చని కేంద్రం ఆశించింది. కానీ దీనికి ప్రతిపక్షాలతో పాటు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. రైతు చట్టాలు తీసుకుచ్చిన సమయంలో దాన్ని రద్దు చేసే వరకు నిద్రపోలేరు. కానీ ఇప్పుడు టమాట, పచ్చి మిర్చి, ఉల్లిగడ్డ, ఇలా అన్ని ధరలు పెరుగుతుంటే అదే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నం.


ఓ రైతు పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ రోజు, టమాట, పచ్చి మిర్చి ధరలు పెరిగితేనే ఇంతలా ఉలికిపడుతున్నారు. రైతు రేపటి రోజు వ్యవసాయం వదిలేస్తే ఏం తింటారు. సాఫ్ట్ వేర్ అంటూ ఫారన్ దేశాలకు వలస పోతున్నారు. వంకాయలు, బీరకాయలు, గోధుమలు, జొన్నలు, గోంగూర బియ్యం లాంటి పంటలు పండించకపోతే ఏం  తింటారని ప్రశ్నించారు.  యాపిల్ ఫోన్లు తింటారా? రెడ్ మీ తింటారా.. ల్యాప్ టాప్ లు తింటారా అని  ప్రజలను ప్రశ్నించారు. అందుకే రైతులను ప్రోత్సహించండని ఆయన పెట్టిన పోస్టు అందరినీ ఆలోచింప జేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: