గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆంధ్రాలో ఇలా పాలకులు మారినా కూడా కొన్ని చోట్ల ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. విషయంలోకి వెళ్తే గతంలో తెలుగుదేశం పార్టీ పాలనలో, అలాగే ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా మల్లవల్లి రైతుల సమస్యలకు పరిష్కారం దొరకలేదని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఇప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినా కూడా అక్కడ రైతుల కష్టాలకు ముగింపు దొరకలేదు.
దాంతో అక్కడ రైతులు మల్లవల్లికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు తమ కష్టాలను వెల్లడించుకున్నారు. దాంతో పవన్ తాను వాళ్లకి అండగా నిలుస్తానని మాట ఇచ్చారని తెలుస్తుంది. నిజానికి పరిష్కారం లేని సమస్యలే ఉండవు. కానీ ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాల వల్ల ఉపయోగం ఏముందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
పోనీ ప్రజల కష్టాలను పూర్తిగా తీర్చలేక పోవచ్చు. కానీ ప్రజల కష్టాలను విని వాళ్లకు ఎంతో కొంత న్యాయం అయితే చేయాలి. అమరావతిలో జగన్ మోహన్ రెడ్డి ఏ విషయంలో అయితే మైనస్ అయ్యారో మల్లవల్లి లో కూడా నాయకులందరూ కలిసి అలానే మైనస్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఎప్పుడూ వాళ్ళకి అండగా నిలుస్తానని మాట ఇచ్చారట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి